Moviesఒక్క యాడ్ కోసం సగం సినిమా రెమ్యూనరేషన్.. హీట్ పెంచుతున్న చిరు...

ఒక్క యాడ్ కోసం సగం సినిమా రెమ్యూనరేషన్.. హీట్ పెంచుతున్న చిరు పారితోషకం..?

యస్,,ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ విషయమే హాట్ టాపిక్ గా నడుస్తుంది. మనకు తెలిసిందే చిరంజీవి కి కమర్షియల్ యాడ్స్ లో నటించడం ఇష్టం ఉండదు అనే సంగతి. అప్పుడెప్పుడో థమ్స్ అప్ ఒక్క ప్రకటన చేశాడు చిరు అంతే.. ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్ళకు మరో యాడ్ లో కనిపించడంతో మెగా అభిమానులు చాలా హ్యాపీగా ఉన్నారు. శుభగృహ రియల్ ఎస్టేట్ వారి బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ చిరు ఓ యాడ్ లో నటించాడు.

ఈ యాడ్ లో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు అందాల సీనియర్ హీరోయిన్ ఖుష్బు..అలాగే హాట్ యాంకర్ అనసూయ. ఓ మిడిల్ క్లాస్ భర్త.. భార్య బర్తడేకి సర్ ప్రైజ్ ఇవ్వడానికి తన సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు ఓ ఇల్లు కొన్ని గిఫ్ట్ క్రింద భార్యకి ఇస్తాడు. ఈ కాన్సెప్ట్ తో యాడ్ ను చాలా బాగా చిత్రీకరించారు లెక్కల మాస్టర్ సుకుమార్. భార్యగా ఖుష్బూ అమాయకత్వంలో అనుమానం..మిడిక్లాస్ భర్త గా చిరు..ఈ యాడ్ కి బాగా సూట్ అయ్యారు.

ఇంత వరకు బాగానే ఉన్నా ఆ తరువాత మ్యాటర్ నే ఇండస్ట్రీలో షాకింగ్ గా అనిపిస్తుంది. ఈ యాడ్ కోసం చిరంజీవి తీసుకున్న పారితోషకం నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఒక్క యాడ్ కోసం మెగాస్టార్ చిరంజీవి..7కోట్లు పుచ్చుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అంటే ఓ నార్మల్ హీరో లో ని సగం రెమ్యూనరేషన్ అనమాట. నిజానికి వేరే బ్రాండ్స్ ప్రమోట్ చేసే నాగచైతన్య, అల్లు అర్జున్ , మహేష్ బాబు ఇంత పుచ్చుకోరు..కానీ ఇక్కడ మెగాస్టర్ కదా..అందుకే ఆ రేంజ్ లో చార్జ్ చేసిన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు అనసూయ, ఖుష్బూ కి కూడా భారీ గానే ముట్టజెప్పారట శుభగృహ రియల్ ఎస్టేట్ వాళ్లు. దీంతో వీళ్ల పారితోషకం మ్యాటర్ హాట్ టాపిక్ గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news