అబ్బ తెలుగు మీడియా రంగంలో పాపులర్ వెబ్‌సైట్‌గా చెప్పుకునే ఓ నీచపు వెబ్‌సైట్‌కు తెలుగు వాళ్లు అన్నా… దేశవ్యాప్తంగా మన కీర్తిని చాటే తెలుగు ప్రజలు ఏ మాత్రం గిట్టడం లేదు. ఆ సైట్‌కు నచ్చితే ఓకే లేకపోతే మన తెలుగోడు ఎంత గొప్ప పనిచేసినా.. ఎంత కీర్తి ప్రఖ్యాతులు తెచ్చుకుని.. మన తెలుగోడి పేరు నిలబెట్టినా విషం కక్కుతోంది. అసలు విషయంలోకి వస్తే త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్‌కు ముందు నెల రోజుల నుంచే ఆ గ్రేట్ వెబ్‌సైట్ సినిమాపై నెగిటివ్ వార్తలు స్టార్ట్ చేసింది. సినిమా లేట్ అవ్వడంతో అనుకున్నంత బజ్ లేదని మొదలు పెట్టిన ఈ విషపు వార్తల పరంపర సినిమా రిలీజ్ అయ్యి 10 రోజులు అయినా ఆగడం లేదు.
కరోనా దెబ్బతో త్రిబుల్ ఆర్ మాత్రమే కాదు.. చాలా సినిమాలు లేట్ అయ్యాయి. ఏ సినిమా అయినా లేట్ అయితే ఆ ఊపు తగ్గుతుంది దానిని తప్పుపట్టలేం. ఇక త్రిబుల్ ఆర్ కథ ఎంచుకోవడమే తప్పన్నట్టుగా ఎన్నో వార్తలు పుంకాను పుంకాలుగా వండుతూ వచ్చింది. ఇక సినిమా రిలీజ్‌కు ముందు బయ్యర్లు 30 శాతం డిస్కౌంట్లు అడుగుతున్నారన్న కడపు మంట వార్త. ఇక రిలీజ్ రోజు అందరూ కూడా సినిమాకు 3 ఆ పైన రేటింగ్‌లు ఇచ్చారు.
బాహుబలి 2 పోల్చి చూస్తే కాస్త తగ్గినట్టు ఉన్నా సినిమా హిట్ అవుతుందనే ప్రతి ఒక్కరు చెప్పారు. విచిత్రం ఏంటంటే సినిమా రిలీజ్‌కు ముందే విషం చిమ్మిన, అసలు ప్రచారం ఇవ్వని నార్త్ వాళ్లు సైతం 3 పైన రేటింగ్ ఇచ్చారు. నార్త్‌లో కూడా సినిమా మెల్లగా ఫికప్ అయ్యింది. సదరు సైట్ మాత్రం 2.5 రేటింగ్ ఇవ్వడంతో పాటు రాజమౌళిని గుడ్డిగా నమ్మి అందరూ మోసపోయారని తెగ భోరుమంది. అంతేకాక విజయేంద్ర ప్రసాద్‌పై సైతం తన అక్కసు వెళ్లగక్కింది.
కట్ చేస్తే సినిమా బాహుబలి 2 రేంజ్‌లో కాకపోయినా అన్ని ఏరియాల్లోనూ దాదాపు బ్రేక్ ఈవెన్‌కు వస్తోంది. ఒకటి రెండు చోట్ల 1, 2 కోట్లకు తక్కువలో ఉంది. ఓవర్సీస్, నైజాం లాంటి చోట్ల భారీ లాభాల్లోకి వచ్చేసింది. ఇది జగమెరిగిన సత్యం. అయితే దీనిపై కూడా ఆ సైట్ కలెక్షన్లు తక్కువ అని ఏడుస్తోంది. ప్రతి రోజు త్రిబుల్ ఆర్ సినిమా మీదో లేదా రాజమౌళిని టార్గెట్ చేయందో వాళ్లకు తిన్నది అరుగుతున్నట్టు లేదు. అందుకే ఏదో ఒక నెగిటివ్ వార్త వేస్తూనే వస్తున్నారు.
ఇక నార్త్‌లో ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వదని ముందు నుంచి వీళ్ల నీచపు రాతలు, ఏడుపుగొట్టు ఆర్టికల్స్ చెప్పాయి. అయితే అక్కడ కూడా రు. 200 కోట్ల వసూళ్లకు చేరువ అవుతోంది. దీంతో తెలుగోడి వీక్ కంటెంట్ బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ కన్నా హిట్ అని మరో దరిద్రపు గొట్టు ఆర్టికల్ వేశారు. అక్కడితో ఆగకుండా ఇప్పుడు ప్రశాంత్ నీల్ వర్సెస్ రాజమౌళిలో ఎవరు గొప్ప అని మరో అజీర్తి ఆర్టికల్ అల్లేశారు.
ఇండస్ట్రీలో బ్లాక్‌మెయిల్ చేసుకుని బతికే ఈ నీచపు వెబ్‌సైట్ గురించి గతేడాది టాలీవుడ్ క్రేజీ యంగ్ హీరో ఓ ఆటాడుకున్నాడు. తాను ఇంటర్వ్యూను ఇవ్వను అన్నందుకే తన గురించి నెగిటివ్ ఆర్టికల్ వేశారంటూ తనపై వచ్చిన ఆ వార్తను చదువుతూ భలే ఆలాడుకున్నాడుటే. ఇక ఇప్పుడు కేజీయఫ్ 2 హిట్ అయితే రాజమౌళికి పోటీగా ప్రశాంత్ నీల్ సరైనోడు అయిపోతాడట.
ప్రశాంత్ నీల్‌ను తక్కువ చేయడం కాదు కాని.. ఆయన డైరెక్ట్ చేసింది కేజీయఫ్.. ఇప్పుడు పార్ట్ 2 వస్తోంది. మరి రాజమౌళి 20ఏళ్లలో ఎన్ని సినిమాలు చేశాడు.. ఎన్ని బ్లాక్బస్టర్ హిట్లు కొట్టాడు. ఇవేవి వీళ్ల గుడ్డి కళ్లకు కనపడడం లేదనుకుంట. పైగా రాజమౌళికి ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం కూడా వీళ్లకు నచ్చడం లేనట్టుంది. వీరందరు లేకుండా రాజమౌళి అసలు సినిమాయే తీయలేడన్నట్టుగా రాసుకు వచ్చారు. ఏదేమైనా ఇలాంటి వెబ్‌సైట్ల రాతలు తెలుగుజాతికే అవమానం.. వీరు తీరు ఎప్పటకి నీచాతినీచం.