యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలలో మున్నా ఒకటి. 2007 సమ్మర్ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలియానా హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్, రాహుల్ దేవ్ కీలక పాత్రల్లో నటించారు. మనసా నువ్వుండే చోటే చెప్పామ్మా సాంగ్ ఇప్పటకీ ఎంతో హైలెట్. హరీష్ జైరాజ్ మ్యూజిక్‌ను ఎవ్వరూ మర్చిపోలేరు. అప్పుడు వరుస హిట్లతో దూసుకుపోతోన్న నిర్మాత దిల్ రాజు బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెరకెక్కింది. వంశీ పైడిపల్లి ఈ సినిమాతో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయం అయ్యాడు.
సినిమా ఎగ్జిగ్యూషన్ బాగున్నా కాని అంచనాలు అందుకోలేక ప్లాప్ అయ్యింది. అప్పటి వరకు దిల్ రాజు బ్యానర్లో వరుసగా హిట్లు వస్తున్నాయి. అసలు ఈ కథను సెలక్ట్ చేసినప్పుడే వద్దని రిజెక్ట్ చేశారట రాజు. అయితే కొరటాల శివ అప్పుడు రచయితగా ఉన్నారు. ఆయన కూడా లేదు కథ బాగుందని చెప్పడంతో పాటు దర్శకుడు వంశీ దిల్ రాజుకు బంధువు కావడం.. సినిమాను హిట్ చేస్తానని కాన్ఫిడెంట్‌గా చెప్పడంతో అయిష్టంగానే ఓకే చేశారట. చివరకు రిలీజ్ రోజు మార్నింగ్ 3 గంటలకు ప్రీమియర్ షో చూసిన వెంటనే సినిమా తేడా కొట్టేసిందని రాజుకు అర్థమైపోయిందట.
వెంటనే సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్లు చేసి సినిమా అనుకున్నదానితో పోలిస్తే కాస్త డిజప్పాయింట్ చేస్తుంది.. నా జడ్జ్‌మెంట్ దాటేసి.. ప్రేక్షకులకు ఎక్కడో నచ్చేస్తే మన లక్… అయితే మీకు నేనున్నానని భరోసా ఇచ్చారట. చివరకు మున్నాకు తొలి ఆటకే ప్లాప్ టాక్ వచ్చింది. అయినా లాంగ్ రన్‌లో కొంత వరకు సినిమా నిలబడింది అంటే అందుకు దర్శకుడు వంశీ టేకింగ్‌తో పాటు కొన్ని వర్గాల ప్రేక్షకులకు సినిమా నచ్చడమే.
ఈ సినిమా ప్లాప్ అయ్యాక దర్శకుడు వంశీ కాస్త డిజప్పాయింట్‌లోకి వెళ్లిపోయారట. ఒకానొక దశలో సినిమాలు వదిలేసి వెనక్కు వెళ్లిపోదామా ? అన్న ఆలోచనలు కూడా ఆయన్ను వెంటాడాయట. అయితే దిల్ రాజుతో పాటు ఎన్టీఆర్ ఆయనకు భరోసా ఇచ్చారని వంశీ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. మున్నా ప్లాప్ అయ్యిందని తెలిశాక వెంటనే ఎన్టీఆర్ ఫోన్ చేసి.. కథ పరంగా ఎక్కడో తేడా కొట్టిందే తప్పా.. దర్శకుడిగా నువ్వు ఫెయిల్ కాలేదని.. నీ టేకింగ్ కొత్తగా ఉందని మెచ్చుకున్నారట.
మంచి కథ ఉంటే రెడీ చేయ్.. నేను నీకు ఛాన్స్ ఇస్తానని చెప్పారట. ఆ తర్వాత బృందావనం కథతో ఎన్టీఆర్‌ను కలవడం.. ఐదు నిమిషాలకే ఎన్టీఆర్ ఓకే చేయడం జరిగిపోయిందని.. ఆ సినిమాతో తాను హిట్ కొట్టానని వంశీ నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. ఏదేమైనా ఎన్టీఆర్ తనకు చేసిన సాయాన్ని తాను ఎప్పటకీ మర్చిపోలేనని ప్రశంసలు కురిపించాడు వంశీ.