రమ్యకృష్ణ..పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందంతో నటనతో ..కోట్లాది అమ్మది హృదయాలను కొల్లగొట్టిన బ్యూటి. దక్షిణాది లేడి సూపర్‌స్టార్ రమ్యకృష్ణ గురించి ..ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తన పర్ ఫామెన్స్ తో స్టార్ హీరోలకు సైతం..దడ పుట్టించిన రమ్య అంటే..ఇండస్ట్రీలో అందరికి ఇష్టమే. ఇండియన్ ఇండస్ట్రీని తన అందాలతో.. అభినయంతో ఆడుకుంది రమ్యకృష్ణ. కొన్నేళ్ల పాటు నెంబర్ వన్ హీరోయిన్గా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో చక్రం తిప్పింది. ఇండస్ట్రీ ఏదైనా తన నటనతో అందరికీ పిచ్చెక్కించింది ఈ నీలాంబరి.
పాత్ర ఏదైనా సరే అందులో ఆమె ఒదిగిపోతారు. నీలాంబరి, శివగామి ఇలా కొన్ని పాత్రలు ఆమె కోసమే పుట్టాయా.? అన్నట్లుగా కీర్తిని ఘడించారు. నీలాంబరిగా మారినా.. శివగామిగా రాజ్యాన్ని పాలించినా.. దేవతగా అవతారం ఎత్తినా.. రమ్యకృష్ణకే చెల్లింది. 1980 ప్రధమార్ధంలో ‘భలే మిత్రులు’ చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైన రమ్యకృష్ణని కాలం వెంటనే కనికరించలేదు. దాంతో నిరాశా నిస్పృహలతో కొనసాగుతోన్న ఆమె కెరియరుకు ‘సూత్రధారులు’ చిత్రం ఆశాకిరణమై నిలిచింది … ఆమెలోని నటిని చాలా చక్కగా ఆవిష్కరించింది.
ప్రజెంట్ సెకండ్ ఇన్నింగిస్ స్టార్ట్ చేసిన ఈమె కుర్ర బ్యూటీలకు సైతం గట్టి పోటీ ఇస్తుంది. 1992 నుంచి 2000 వరకు పలు భాషల్లో తన అసమాన ప్రతిభతో ఓ వెలుగు వెలిగింది రమ్యకృష్ణ కే.రాఘవేంద్రరావు చిత్రాలకు కేరాఫ్ రమ్యకృష్ణ అనేంతగా ఆయన దర్శకత్వంలో సూపర్‌హిట్ సినిమాలు చేసింది. సెకండ్ ఇన్నింగ్స్‌లోను క్షణం తీరక లేకుండా సినిమాలు చేస్తున్న రమ్య ప్రస్తుతం తన భర్త దర్శకత్వంలో వస్తున్న రంగ మార్తండలో నటిస్తోంది. ఈ సినిమా నట సామ్రాట్ అనే ఓ మరాఠి సినిమాకు రీమేక్‌గా వస్తోంది. అటు గ్లామర్ క్వీన్‌గా, ఇటు భక్తిరస చిత్రాలతోనూ రమ్యకృష్ణ సినీ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకున్నారు.బాహుబలిలో రాజమాతగా ఆమె పర్ఫామెన్స్ అందన్నీ మంత్రముగ్ధుల్ని చేసింది.
అయితే , ఆమె సినీ కెరీర్ లో దాదాపు అందరి హీరోలతోను జతకట్టి మెప్పించింది..ఒక్క హీరో తో తప్ప. టాలీవుడ్ ఫ్యామిలీ హీరో గా పేరు సంపాదించుకున్న ఆయన తో రమ్య ఒక్క సినిమా కూడా చేయలేదు. దానికి కారణం.. ఆయన ఆమె నటన పై చేసిన కామెంట్స్ నే అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి కెరీర్ మొదట్లో ఆ హీరోతో అవకాశం దక్కించుకున్న రమ్య..అంతక ముందు సినిమాలు చూసి ఈ హీరోయిన్ కి ఎక్స్ ప్రేషన్స్ పలికించడం రాదు.. డల్ ఫేస్ ..నటనకి పనికిరాదు అంటూ ఆమె ముందే అన్నారట. అసలె ముక్కు మీద కోపం ఉన్న రమ్య..ఆ సినిమా నుండి తప్పు కోవడమే కాకుండా..ఇప్పటి వరకు ఆయనతో మాట్లాడింది లేదు..సినిమా చేసింది లేదు. ఆ హీరో ఎవరో మీరు గెస్ చేసే ఉంటారే..?