సినిమా పరిశ్రమలో అలనాటి మేటీ హీరోలు చాలా మంది ఉన్నారు. వీరిలో కొందరి గురించి ఈ తరం జనరేషన్ వాళ్లకు తెలియదు. 1980వ దశకంలో ఆనంద్ రాజా అనే నటుడు కూడా ఉన్నాడు. అప్పట్లో ఈయన అందానికి అమ్మాయిలు ఫిదా అయిపోయేవారు. ఈ డ్రీమ్ బాయ్‌ను దర్శకరత్న దాసరి నారాయణరావు 1980ల్లో వెండితెరకు పరిచయం చేశారు. దాసరి దర్శకత్వంలోనే స్వప్న అనే సినిమా రిలీజ్ అయ్యి అప్పట్లో యువతను ఓ ఊపు ఊపేసింది.
స్వప్న అనే నటి ఈ సినిమాతో వెండితెరకు హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు చెళ్లపిళ్ల సత్యం సంగీతం అందించారు. అంకితం నీకే అంకితం నూరేళ్ల జీవితం అనే పాటు ఎస్పీ బాలు ఆలపించగా ఈ పాటు అప్పట్లో ఓ సెన్షేషన్. ఈ పాటను దాసరి నారాయణరావు స్వయంగా రచించారు. ప్రేమకథా సినిమాగా తెరకెక్కిన స్వప్న అప్పట్లో ఓ సెన్షేషనల్ హిట్.
అప్పటి స్టార్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ శోభన్ బాబు వంటి చిత్రాలతో పోటీపడి మరీ ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత రాజా కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. ఆ తర్వాత హీరోగా ఛాన్సులు తగ్గిపోవడంతో సపోర్టింగ్ రోల్స్ చేశాడు. ఆ తర్వాత బుల్లితెరపై కూడా ఎంట్రీ ఇచ్చి సీరియల్స్‌లో నటించాడు. ప్రముఖ బుల్లితెర డైరెక్టర్ మంజులా నాయుడు డైరెక్ట్ చేసిన రుతురాగాలు సినిమాలో నటించాడు. ఆ తర్వాత ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించాడు.
ఇక ఆనంద్ రాజాకు మన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు బంధుత్వం ఉంది. ఎన్టీఆర్ తల్లి షాలిని మనందరకు తెలిసిన వారే. షాలిని పుట్టింది కర్నాకటలో.. ఆ తర్వాత ఆమె హైదరాబాద్‌కు వచ్చి నల్లకుంటలోని శంకర్‌మఠం దగ్గర ఉండేవారు. ఈ క్రమంలోనే హరికృష్ణతో ఏర్పడిన పరచయంతో ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది.
ఇక శాలిని సోదరినే ఈ ఆనంద్ రాజా వివాహం చేసుకున్నారు. అంటే జూనియర్ ఎన్టీఆర్‌కు ఆనంద్ రాజా వరసకు బాబాయ్ అవుతారు. ఏదేమైనా నటుడిగా చాలా కాలం పాటు ఆనంద్ రాజా తనదైన ముద్ర వేశారు. రాజా మన మధ్య లేకపోయినా ఆయన సినిమాలతో పాటు దూరదర్శన్‌లో ఇప్పుడు వచ్చినా బుల్లితెర ప్రేక్షకులు అతుక్కుపోయి చూసే రుతురాగాలు సీరియల్ ద్వారా ఆయన మన మధ్యలో ఎప్పటకీ ఉండిపోతారు.