పాత వైన్ ఎంతగా నిల్వ ఉంటే అంతగా రుచి పెరుగుతుందన్న నానుడి ఉంది. ఇది నిజం కూడా.. ఇప్పుడు బాలీవుడ్ ముదురు ముద్దుగుమ్మలను చూస్తే అలాగే అనిపిస్తోంది. వీళ్ల ఏజ్ పెరుగుతోన్న కొద్ది అందం మరింత పెరుగుతూ వస్తోంది. ఇంకా చెప్పాలంటే వీళ్లు కుర్ర హీరోయిన్లకు పోటీ అయిపోతున్నారు. ఏజ్ పెరుగుతోన్న కొద్ది సరికొత్త అందంతో మెరిసిపోతున్నారు. ఐశ్వర్య రాయ్- మలైకా అరోరా- టబు- రవీనా టాండన్- మాధురీ దీక్షిత్ – భాగ్యశ్రీ- ఇంద్రజ- నదియా లాంటి సీనియర్ నటుమణులను చూస్తే వయస్సుతో పాటు వీరు అందంలో ఎలా మెరుగు అవుతున్నారో అర్థం కావట్లేదు.
ఐశ్వర్యారాయ్ ఒకప్పుడు ప్రపంచ సుందరి.. అప్పట్లో ఆమె అందానికి పడని వాడు ఉండరు. అలాంటిది ఆమెకు పెళ్లయ్యి పిల్లలు కూడా పుట్టారు. ఇది జరిగి కూడా 15 ఏళ్లు దాటుతోంది. ఐష్ వయస్సు ఇప్పటికే 48 ఏళ్లు. మరో యేడాదిలో ఆమె హాఫ్ సెంచరీ కొట్టేస్తుంది. అసలు ఆమెను చూస్తే ఆమె జస్ట్ 30లో ఉందా ? అనిపించేలా ఉంది. ఇప్పటకీ ఆమెకు హీరోయిన్గా ఛాన్సులు వస్తోన్న పరిస్థితి. అసలు వృద్ధాప్యం అనేది ఐష్ దరిచేరదు అనిపించేలా ఉంది.
ఇక హాట్ ఐటెం బాంబ్ మలైకా అరోరా 48 ఏళ్ల లేట్ వయస్సులోనూ ఎంత ఘాటు ప్రేమ, రొమాన్స్ ఒలకబోస్తుందో ? చూస్తూనే ఉన్నాం. పైగా తనకంటే పదేళ్లు చిన్నోడు అయిన అర్జున్ కపూర్‌తో ఆమె ఏ మాత్రం సిగ్గులేకుండా చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తోంది. బహుశా ఈ వయస్సులో ఆమె అందంతో పాటు ఒంపుసొంపులకే అర్జున్ కపూర్ పడిపోయి ఉండొచ్చు. మలైకా గ్రేస్ అంతా ఇంతా కాదు.. జిమ్‌లో ఆమె ఎన్ని వర్కవుట్లు చేస్తుందో చూస్తేనే మతులుపోతూ ఉంటాయి. అసలు ఆమె వయస్సు 25నే అనిపించేలా శరీరాన్ని ఒంపులు తిపేస్తూ ఉంటుంది.
ఇక ఒకప్పటి కుర్రకారు ఆరాధ్యదేవత రవీనా టాండన్ టూ ఎనర్జీయే. కేజీఎఫ్ 2 సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకులను త్వరలోనే పలకరించోబోతన్న రవీనా ఇటీవలే విడుదలైన అరణ్యక్ సినిమాలో తన లుక్‌తో ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. రవీనా వయస్సు 47 ఏళ్లు. కానీ ఆమె ఇప్పటకీ చాలా స్ట్రాంగ్ ఫిజిక్‌తో ఓ వెలుగు వెలిగిపోతూ ఉంటుంది. 1994లో మోహ్రా సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ఆమె మస్త్ మస్త్ గర్ల్ ట్యాగ్ లైన్‌తో పాపులర్ అయ్యి.. ఇప్పటకీ అదే ట్యాగ్ లైన్‌తో కొనసాగుతోంది.
ఒకప్పుడు తన అందంతో పాటు ఒంపుసొంపులతో సౌత్ టు నార్త్ కుర్రకారును హీటెక్కించేసిన మన హైదరాబాదీ అమ్మాయి టబు 51 ఏళ్లు పూర్తి చేసుకుంది. నిరంతరం వ్యాయామాలు చేయడంతో ఆమె అందం చెక్కు చెదరకుండా చూసుకుంది. టబు ఇప్పటకీ పెళ్లి చేసుకోలేదు. హైదరాబాద్‌లోనే ఆమె ఉంటోంది. ఇక ఒకప్పుడు తన డ్యాన్స్‌తో దేశాన్ని ఊపేసిన మాధురి దీక్షిత్ వయస్సు 54 ఏళ్లు. ఆమె ఇద్దరు పిల్లల తల్లి అని చెపితే ఎవ్వరూ నమ్మరు.
మాధురి తన అందమైన ఫొటోలతో ఇంటర్నెట్ను, సోషల్ మీడియాను ఎలా షేక్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం. మైనే ప్యార్ కియా సినిమాతో ఆమె నేషనల్ వైడ్‌గా అప్పట్లో యూత్‌లో కిర్రాక్ హీరోయిన్ అయిన భాగ్యశ్రీ సైతం లేట్ ఏజ్ లో మెరుపులు మెరిపిస్తోంది. 53 ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ అదే అందంతో ఉంది. ఇక ఇంద్రజ, నదియా, రాశీ లాంటి వాళ్లు కూడా నాలుగున్నర పదుల వయస్సు దాటేసినా అదే అందం మెయింటైన్ చేస్తూ వస్తున్నారు.