సినిమా రంగంలో ఉన్న వాళ్ల బంధాలు చాలా మందికి అర్థం కావు. సినిమా వాళ్లకు, రాజకీయాలకు మధ్య లింకులు ఉంటాయి. ఇది 1960 నుంచే నడుస్తోంది. బాలీవుడ్లో ముందుగా రాజకీయ నాయకులకు, సినిమా వాళ్లకు ఎఫైర్లు.. ఆ తర్వాత పెళ్లిళ్లు అనే సంస్కృతి స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత ఈ సంస్కృతి తమిళనాడు, ఆంధ్రాకు కూడా వచ్చేసింది. తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌కు, స్టార్ నటి జయలలితకు మధ్య ఉన్న లింకులు తెలిసిందే. ఆ తర్వాత టాలీవుడ్లో కూడా సినిమా వాళ్లు రాజకీయాలతో లింకులు పెట్టుకుని, సంబంధాలు కలుపుకోవడం జరిగింది.
ఈ సంస్కృతి కన్నడ సినిమా ఇండస్ట్రీలోకి కూడా తర్వాత పాకింది. కర్నాటక మాజీ ముఖ్యమంత్రులు అయిన తండ్రి, కొడుకులు దేవగౌడ, కుమారస్వామి గౌడకు రాజకీయంగా ఎంతో క్రేజ్ ఉంది. కర్నాకటలో తండ్రి, కొడుకులు ముఖ్యమంత్రులు అయ్యి అరుదైన రికార్డు నెలకొల్పారు. ఇక గతంలో దేవగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు కుమారస్వామి డిస్ట్రిబ్యూటర్‌గాను, నిర్మాతగాను కొన్ని సినిమాలు నిర్మించారు.
ఆ సమయంలో కుమారస్వామి కన్నడ సినిమా రంగాన్ని శాసించారు. టాప్ హీరోలతో సినిమాలు తీయడంలో.. పెద్ద సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేయడంలోనూ ఆయనది అందెవేసిన చేయిగా ఉండేది. ఆ టైంలోనే యంగ్ హీరోయిన్ రాధిక కుట్టితో కుమారస్వామి ప్రేమాయణం కొనసాగించారు. అప్పటికే ఆయనకు అనితతో పెళ్లయ్యి యంగ్ హీరో నిఖిల్ గౌడతో పాటు పిల్లలు ఉన్నారు.
అయితే కుమారస్వామి నిర్మాతగా చేసిన సినిమాల్లో నటించిన రాధికతో ప్రేమలో పడిపోయారు. కొన్నాళ్ల పాటు వీరు సీక్రెట్‌గా కాపురం కూడా చేశారని అంటారు. ఆ తర్వాత కుమరస్వామి రాధికను రెండో భార్యగా స్వీకరించారు. రాధిక మన టాలీవుడ్‌కు కూడా పరిచయమే..! ఆమె తెలుగులో నందమూరి హీరో తారకరత్న హీరోగా వచ్చిన భద్రాద్రి రాముడు సినిమాలో హీరోయిన్గా నటించింది.
ఆ సినిమా ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అవతారం సినిమాలో కూడా ఆమె నటించింది. ఇక కుట్టి రాధిక – కుమారస్వామి దంపతులు ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చారు. వీరిద్దరి మధ్య వయస్సులో చాలా వ్యత్యాసం ఉంది. ముందు వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందని.. మాజీ ముఖ్యమంత్రితో హీరోయిన్‌కు ఎఫైర్ అన్న వార్తలు అప్పట్లో బాగా పాపులర్ అయ్యేవి. ఇవి నిజం చేస్తూ రాధికను తన భార్యగా కుమారస్వామి ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు.
రాధిక కన్నడ నాట నిర్మాతగా మారి కూడా కొన్ని సినిమాలు నిర్మించింది. ఆమె సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటూ వస్తోంది. కారణం ఏమైందో గాని.. ఇటీవల కుమారస్వామి తిరిగి మొదటి భార్య అనితకు మరింత దగ్గర కావడంతో రాధికకు, కుమారస్వామికి మధ్య గ్యాప్ వచ్చిందని అంటున్నారు.