టాలీవుడ్‌లో లెజెండ్రీ నిర్మాత దిల్ రాజు గురించి పెద్ద చరిత్రే రాయవచ్చు. నైజాం డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన రాజు ఆ తర్వాత 2003లో వచ్చిన దిల్ సినిమాతో డిస్ట్రిబ్యూటర్‌గా మారారు. అక్కడ నుంచి వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా రాజు దూసుకుపోయారు. చాలా తక్కువ టైంలోనే తన బ్యానర్లో 50 సినిమాలు నిర్మించారు. దిల్ రాజు బ్యానర్లో వచ్చిన సినిమాల్లో దాదాపు 80 – 85 శాతం సినిమాలు సక్సెస్ అయినవే.
ఇంకా చెప్పాలంటే ఆయన జడ్జ్‌మెంట్ అంటే ఇండస్ట్రీ వర్గాలకే కాదు.. ఇటు టాప్ హీరోలకు సైతం ఓ గురి ఉంటుంది. దిల్‌తో ప్రారంభమైన రాజు ప్రస్థానంలో చివరకు ఆయన పేరు ముందే తన తొలి సినిమా యాడ్ అయ్యి ఆయన్ను ఇండస్ట్రీలో దిల్ రాజును చేసేసింది. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా 50వ సినిమా తెరకెక్కుతోంది. ఏస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా వస్తోంది.
కియరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా రు. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఓ పాటకే రు. 10 కోట్లు.. మరో ఫైట్‌కు రు. 10 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిసింది. ఇక దిల్ రాజు హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్‌కు ఓ సినిమా విషయంలో అన్యాయం చేశారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రభాస్ హీరోగా దశరథ్ దర్శకత్వంలో మిస్టర్ ఫర్‌ఫెక్ట్ సినిమా వచ్చింది.
ఈ సినిమాలో కాజల్, తాప్సీ హీరోయిన్లుగా నటించారు. క్లాసికల్, ఎమోషనల్ ఎంటర్టైనర్‌గా వచ్చిన ఈ సినిమా మంచి విజయం నమోదు చేసింది. ఈ సినిమాలో కాజల్ రోల్‌కు ముందుగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ను తీసుకున్నారట. ఆమెతో కొన్ని రోజుల పాటు కొన్ని సీన్లు షూట్ చేశాక చూస్తే ఆమె ఆ క్యారెక్టర్‌కు నప్పదని అందరూ డిసైడ్ అయ్యారట.
రకుల్ చాలా సన్నగా ఉండడంతో పాటు ప్రభాస్ పక్కన ఆనడం లేదన్న నిర్ణయానికి దిల్ రాజుతో పాటు మిగిలిన టీం వచ్చేశారట. వెంటనే హీరోయిన్‌ను మార్చాలని నిర్ణయం తీసుకుని ఆమెకు సారీ చెప్పి తప్పించారట. అయితే అదే టైంలో రాజు బ్యానర్లోనే ఎన్టీఆర్ హీరోగా బృందావనం సినిమా నడుస్తోంది. ఆమెకు కథ చెపితే వెంటనే ఓకే చెప్పేసిందట. అయితే ప్రభాస్ తాను అప్పటికే కాజల్‌తో డార్లింగ్ సినిమా చేసి ఉన్నానని అని సందేహించాడట.
అయితే రాజు ఏమవుతుందని.. వెంకటేష్ – సౌందర్య కాంబినేషన్లో ఎన్ని సినిమాలు రాలేదని.. ఒకే హీరో, హీరోయిన్ ఎన్ని సినిమాల్లో అయినా నటించవచ్చని.. ఆ కథల వేరియేషన్‌ను బట్టి, పాత్రలను బట్టి సినిమా రిజల్ట్ వస్తుందని చెప్పడంతో చివరకు ప్రభాస్ కాజల్‌ను ఓకే చేశాడట. అలా రకుల్‌ప్రీత్‌ను ముందుగా ఈ సినిమాలో తీసుకుని షూట్ చేశాక తప్పించాల్సి వచ్చిందని రాజు చెప్పారు. అయితే తనకు అంతిమంగా సినిమా రిజల్ట్ ముఖ్యమని.. అందుకే ఎక్కడా రాజీపడనని ఆయన తెలిపారు.