దిల్ రాజు..పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కష్టపడి తన తెలివి తేటలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ చిన్న డిస్ట్రిబ్యూటర్ నుండి..టాలీవుడ్‌లో అగ్ర నిర్మాత గా ఎదిగి ..ఇప్పుడు టాలీవుడ్ లోనే నెం 1 ప్రోడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నాడు. సినీ ఇండస్ట్రీలో దిల్ రాజు ప్రస్థానం ఎంత విజయవంతమైందో తెలిసిందే. ఫస్ట్ లో చిన్న డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన దిల్ రాజు మెల్ల మెల్ల్గా ఎదుగుతూ నేదూ నైజాం డిస్ట్రిబ్యూషన్ శాసించే కింగ్‌గా ఎదిగాడు అంటే దానిలో ఆయన కష్టం ఎంత ఉందో మనం అర్ధంచేసుకోవచ్చు. ఇక 2003లో వివి. వినాయక్ దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన దిల్ సినిమాతో రాజు నిర్మాత అయ్యారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన దిల్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత వరుస హిట్లతో రాజు ఇండస్ట్రీలో మహామహా నిర్మాతలనే తొక్కి పడేశారు.
ప్రజెంట్ ఈయన పలు బడా చిత్రాలు నిర్మించడంతో పాటు..చిన్న చిన్న సినిమాలకి కూడా ప్రోడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. స్టార్ హీరోలతో పాటు కొత్త నటీనటులతోనూ ఆయన సినిమాలు చేస్తూ విజయాలను అందుకుంటున్నారు. పాన్ ఇండియా ప్రొడ్యూసర్‌గా తనదైన గుర్తింపును సంపాదించుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇక రీసెంట్ గా ఈ ఇంటర్వ్యుల్లో పాల్గోన్న ఈయన తన సినీ కెరీర్ గురించి చెప్పుతూ,,తాను పడిన బాధలు చెప్పుకొస్తూనే సినిమా నిర్మించే విషయంలో తాను ఎంత స్ట్రీక్ట్ గా ఉంటానో కూడా చెప్పుకొచ్చాడు.
ప్రభాస్ హీరో గా, తాప్సీ, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటించిన చిత్ర,Mr. Perfect. ఈ సినిమా 21 st అప్రిల్ 2011 న రిలీజై బాక్స్ ఆఫిస్ రికార్డులను తిరగరాసింది. మొండి గా తాను అనుకున్నదే జరగాలి తాను ఎవ్వరి కోసం కాంప్రమైజ్ అవ్వను అనే అబ్బాయి..ప్రేమించిన వాడి కోసం ఓ అమ్మాయి ఎలాంటి త్యాగానికైన సిద్ధమౌతుంది అనే కాన్సెప్ట్ తో అద్బుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమాకి నిర్మాత దిల్ రాజునే. అప్పట్లో ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ని అనుకున్నారట. కొన్ని షాట్స్ కూడా తీశారట. కానీ ప్రభాస్ పక్కన రకుల్ మరీ సన్నగా ఉండటంతో.. అప్పుడే మ్మచి క్రేజ్ లో ఉన్న కాజల్ ని హీరోయిన్ గా తీసుకున్నారట. ఈ విషయం చెప్పుతూ..అప్పుడు రకుల్ ని ఆ సినిమా నుండి తీసేయ్యడం బాధగా అనిపించింది. కానీ సినిమా కోసం తప్పలేదు అంటూ చెప్పుకొచ్చాడు. నిజానికి ప్రభాస్ పక్కన కాజల్ నే బాగుంది..రకుల్ ని పెట్టుంటే సినిమా దొబ్బేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.