అల్లు కాంపౌండ్ బ్యానర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ గని సినిమా. ఇప్పటికే పలు మార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ఇక లాభం లేదనుకుని డిసైడ్ అయిన అల్లు కాంపౌండ్ ఏప్రిల్ 8న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. డేట్ అయితే వేసేశారు. ప్రమోషన్లు జోరుగా నడుస్తున్నాయి. తాజాగా వైజాగ్‌లో జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ఏకంగా బన్నీ హాజరయ్యాడు. సినిమా తాను చూశానని చాలా బాగుందంటూ ఆకాశానికి ఎత్తేశాడు. అంతకు మించి వరుణ్ కష్టపడ్డాడని కూడా మెచ్చుకున్నాడు.
ఇదంతా బాగానే ఉంది. బాక్సాఫీస్ దగ్గ పరిస్థితులు మాత్రం అంత అనుకూలంగా ఉన్నట్టు కనపడడం లేదు. ఓ వైపు థియేటర్లలో ఆర్ ఆర్ ఆర్ హవా నడుస్తోంది. ఏప్రిల్ 8న బీ, సీ సెంటర్లలో ఈ సినిమాను ఎత్తేస్తారన్న గ్యారెంటీ లేదు. కేజీయఫ్ 2 వచ్చే వరకు సింగిల్ స్క్రీన్లతో పాటు బీ, సీ సెంటర్లలో ఈ సినిమాయే ఉంచుతారు. పైగా అప్పటకి టిక్కెట్ రేట్లు తగ్గిపోతే ఓ సెక్షన్ ఆడియెన్స్ ఈ సినిమా చూసేందుకు రెడీగా ఉన్నారు.
దీనిని బట్టి ఇప్పట్లో త్రిబుల్ ఆర్ మానియా తగ్గేలా లేదు. హిందీలో ఎటాక్ లాంటి సినిమా ఉన్నా కూడా త్రిబుల్ ఆర్ ముందు ఏ సినిమా ఆగడం లేదు. ఇక ఏప్రిల్ 8న గని వస్తే ఆ వెంటనే పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలు ఉన్న విజయ్ బీస్ట్ వస్తోంది. ఆ మరుసటి రోజే కేజీయఫ్ 2 వస్తోంది. ఈ రెండు సినిమాల మధ్యలో అసలు గని ఆగుతుందా ? అన్న సందేహాలు ఉన్నాయి. అసలే సినిమాకు భారీ పెట్టుబడులు పెట్టారు. బయ్యర్లు కూడా భారీ రేట్లకు కొనుగోలు చేశారు.
సినిమాకు గద్దలకొండ గణేష్‌లా సూపర్ టాక్ రావడంతో పాటు లాంగ్ రన్ ఉండాలి. అప్పుడే గని బాక్సాఫీస్ దగ్గర సేఫ్‌గా బయటపడే ఛాన్సులు ఉన్నాయి. విజయ్ బీస్ట్‌కు తెలుగులోనూ భారీ బజ్ ఉంది. ఇక కేజీయఫ్ 2పై తెలుగులో కూడా త్రిబుల్ ఆర్ రేంజ్లో అంచనాలు ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో గనిపై భారీ పెట్టుబడులు పెట్టిన బయ్యర్లలో అయితే భయాలు ఉన్నాయి. అయితే మేకర్స్ మాత్రం సినిమా హిట్ అవుతుందన్న ధీమాతో ఉన్నారు.
వరుణ్ సరసన సయీ మంజ్రేకర్ నటించిన ఈ సినిమాలో కన్నడ సీనియర్ హీరో ఉపేంద్ర, బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి కీలక పాత్రలు పోషించారు. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. ఈ నెలలో గనితో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న వరుణ్ వచ్చే నెలలో ఎఫ్ 3 సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.