టాలీవుడ్ అంటేనే బంధాలు.. బంధుత్వాలుతో నిండిపోయి ఉంటుంది. తెలుగు సినిమా రంగంలో ఇప్పుడు స్టార్ హీరోలుగా ఉన్న వారిలో 60 శాతం మంది ఇండస్ట్రీలో ఏదో ఒక రిలేషన్ ఉన్న వారే కావడం విశేషం. తెలుగు సినిమా రంగంలో మూడు తరాల నుంచి కొనసాగుతున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. నందమూరి వంశం, అక్కినేని వంశం, దగ్గుబాటి వంశం, ఘట్టమనేని వంశం హీరోలు మూడో తరంలోనూ దూసుకుపోతున్నారు. ఇటు మెగా ఫ్యామిలీ నుంచి కూడా రెండో తరం హీరోలు సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంటే… రేపటి రోజున మూడో తరం హీరోలు కూడా ఈ కుటుంబం నుంచి వెండితెరపై ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ గా ఉన్నారు.
టాలీవుడ్ లో మనకు తెలిసిన బంధుత్వాలు మాత్రమే కాదు, తెలియని రిలేషన్లు కూడా చాలానే ఉంటాయి. టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య యంగ్ హీరోల్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకు పోతున్నాడు. ఛలో లాంటి హిట్ తర్వాత నాగశౌర్యకు మంచి మార్క్ కూడా వచ్చింది. ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై శౌర్య తల్లి ఉషా మూల్పూరి నిర్మించిన ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నాగ శౌర్య కు జోడిగా రష్మిక మందన్న తొలిసారిగా తెలుగులో నటించింది. ఈ సినిమా దెబ్బకు రష్మిక నేషనల్ వైడ్ గా తిరుగులేని క్రేజీ హీరోయిన్ అయిపోయింది.
ఇక నాగశౌర్య సొంత మేనత్త కూడా టాలీవుడ్‌లో ఫేమస్ యాక్టర్ అన్న విషయం కొంత మందికే తెలుసు. ఆమె ఎవరో కాదు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లతాశ్రీ. లతాశ్రీ సొంత అన్న కొడుకు నాగశౌర్య కావటం విశేషం. అయితే ఈ రెండు కుటుంబాల మధ్య గత కొన్నేళ్లుగా మాటలు లేవు అన్న విషయాన్ని లతాశ్రీ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు. అసలు అన్న కుటుంబం గురించి మాట్లాడేందుకు కూడా ఆమె ఇష్టపడలేదు.
అయితే చిన్నప్పటి నుంచి పెరిగిన అనుబంధం నేపథ్యంలో అన్న అంటే తనకు ఇష్టం ఉంటుందని, అలాగే అల్లుడు నాగ శౌర్య అన్న కూడా ఇష్టమే అని లతా శ్రీ చెప్పుకొచ్చింది. అన్న మన వాడు… అల్లుడు మన వాడు అయినా.. వదిన మనది కాదు అని మూల్పూరు ఉషాపై తన కోపం వ్యక్తం చేసినట్లుగా ఆమె మాట్లాడారు. రెండు కుటుంబాల మధ్య మాటలు లేవని అసలు నాగశౌర్య కుటుంబం గురించి మాట్లాడేందుకు కూడా తనకు ఇష్టం లేదని చెప్పింది.
ఇక నాగశౌర్య సినిమాల గురించి కూడా లతా శ్రీ మాట్లాడింది. శౌర్య నటించిన అన్ని సినిమాలు బాగుంటాయని చెప్పిన ఆమె.. తన అమ్మ ఉన్నప్పుడు ఆమెతో కలిసి నాగశౌర్య నటించిన సినిమాలలో ఊహలు గుసగుసలాడే సినిమా మాత్రమే తాను చూశానని చెప్పింది.