Moviesబాహుబ‌లి క‌థ ఆ ఒక్క సీన్ నుంచే పుట్టిందా... ఎంత విచిత్ర‌మో...

బాహుబ‌లి క‌థ ఆ ఒక్క సీన్ నుంచే పుట్టిందా… ఎంత విచిత్ర‌మో తెలుసా…!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన విజువ‌ల్ వండ‌ర్ తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్ల‌లు దాటించేసి ప్ర‌పంచ వ్యాప్తంగా తీసుకుపోయింది. బాహుబ‌లి ది బిగినింగ్ అయితే రు. 600 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఈ సినిమాతో తెలుగు సినిమా స్వ‌రూప‌మే మారిపోయింది. ప్ర‌పంచ స్థాయికి వెళ్లిపోయింది. భార‌తీయ సినిమా అంటే ఒక‌ప్పుడు బాలీవుడ్ వైపు చూసే జ‌నాలు ఇప్పుడు తెలుగు సినిమా వైపు చూస్తోన్న ప‌రిస్థితి. ఈ ఘ‌న‌త ఖ‌చ్చితంగా రాజ‌మౌళికే చెందుతుంది.

ఇక బాహుబ‌లి స్టోరీని రాజ‌మౌళి సినిమాల ఆస్థాన ర‌చ‌యిత అయిన ఆయ‌న తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాదే స్వ‌యంగా రాశారు. ముందుగా దీనిని ఒక సినిమాగా తీయాల‌ని అనుకున్నారు. అయితే ఫ‌స్ట్ పార్ట్ తీస్తున్న‌ప్పుడే సినిమా 4 గంట‌లుగా వ‌చ్చే ఛాన్సులు ఉండ‌డంతో పాటు ఏ సీన్‌ను క‌ట్ చేసి చూపించేందుకు రాజమౌళికి ఇష్టం లేక‌పోవ‌డం.. ఆ త‌ర్వాత మార్కెటింగ్ స్ట్రాట‌జీలో భాగంగా బాహుబ‌లిని రెండు పార్టులుగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చారు. ఫ‌స్ట్ పార్ట్‌ను మించిపోయి రెండో పార్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అయ్యింది.

తాజాగా త్రిబుల్ ఆర్‌తో స‌క్సెస్ కొట్టిన విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ అస‌లు బాహుబ‌లి క‌థ ఎలా ? పుట్టిందో చెప్పారు. ఈ క‌థ‌కు మూలం క‌ట్ట‌ప్ప పాత్రే అన్న ఆయ‌న పార్ట్ 1లో స‌త్య‌రాజ్ – సుదీప్ మ‌ధ్య వ‌చ్చే సీన్ ఉంది క‌దా ? ఆ సీన్‌తోనే సినిమాను మొద‌లు పెట్టామ‌ని.. అయితే అప్పుడు అనుకున్న సీన్ వేరేగా ఉంటుంద‌ని విజ‌యేంద్ర తెలిపారు. విదేశాల నుంచి ఆయుధాలు అమ్ముకునేందుకు ఓ వ‌ర్త‌కుడు వ‌స్తాడు. ఇక్క‌డ చూస్తే 80 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న ఓ పెద్దాయ‌న పిల్ల‌ల‌కు క‌త్తి యుద్ధం నేర్పుతూ ఉంటాడు.

ఆ ముసలాయ‌న సాము చూసి గొప్ప వీరుడిలా ఉన్నాడే అనుకుని మాట క‌లిపితే మీకు బాహుబ‌లి తెలియ‌దా ? అని ఆ వ‌ర్త‌కుడిని ప్ర‌శ్నిస్తాడు. తెలియ‌దే అని అంటే తామిద్దరం క‌లిసి చాలా యేళ్లు యుద్ధాలు చేశాం.. సాధ‌న చేశాం అని ఆ ముస‌లాయ‌న చెపుతాడు. ఓ సారి అడవిలో వెళుతుంటే ఒకే సారి వ‌చ్చి 200 మంది వ‌స్తే. వాళ్ల‌తో యుద్ధం చేస్తాడు. సాయంత్రం అయ్యేస‌రికి అత‌డి ఒళ్లంతా ర‌క్తంతో త‌డిసి ముద్ద‌వుతుంది… కానీ అత‌డి ఒంటిమీద ఉన్న ఒక్క ర‌క్త‌పు చుక్క కూడా అత‌డిది కాదు… ఎందుకంటే అత‌డి ఒంటిమీద గాటు కూడా పెట్ట‌గ‌ల మ‌గాడు ఇప్ప‌టి వ‌ర‌కు పుట్ట‌లేద‌ని ఆ ముస‌లాయ‌న చెపుతాడు.

ఆ వీరుడిని ఓ సారి చూడాల‌ని అంటాడు ఆ వ‌ర్త‌కుడు. లేదు చ‌నిపోయాడు అని బాధ‌ప‌డ‌తాడు.. అంత పెద్ద యోధుడు ఎలా ? చ‌నిపోయాడ‌ని అంటే నేనే చంపేశాన‌ని ఆ ముస‌లాయ‌న అంటాడు. క‌త్తి పోటు క‌న్నా వెన్నుపోటు బ‌ల‌మైంది ? ఆ పోటుతోనే నేను చంపేశాన‌ని చెపుతాడు. ఆ త‌ర్వాత రోజు శివ‌గామి నీళ్ల‌లో బాహుబ‌లిని ఒంటి చేత్తో ఎత్తుకుని ప్రాణాలు కాపాడే సీన్ గురించి చెప్పాన‌ని.. ఇక్క‌డ నుంచే క‌థా విస్త‌ర‌ణ జ‌రిగింద‌ని విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news