తెలుగు సినిమా రంగంలో ఒకప్పుడు నిర్మాత అనే పదానికి ఓ క్రేజ్ తెచ్చిన వారిలో రామానాయుడు, అశ్వనీదత్, ఆ తర్వాత సురేష్‌బాబు లాంటి వాళ్లు ఉండేవారు. ఇక ఇప్పటి తరంలో నిర్మాతలకు గౌరవాలు పోతున్నాయి. ఎవరికి వారు ఏదో ఒక బిజినెస్‌లోనో లేదా రియల్ భూంలో వచ్చిన డబ్బునో తీసుకువచ్చి స్టార్ కాంబినేషన్ సెట్ చేసి సినిమాలు తీస్తున్నారు. హిట్ అయితే మరో ఒకటి రెండు సినిమాలు చేస్తారు.. లేకపోతే కనుమరుగైపోతున్నారు. కానీ దిల్ రాజుకు ఎన్ని వ్యాపారాలు ఉన్నా ఆయన నమ్మింది సినిమా.. సంపాదిస్తే ఇక్కడే సంపాదిస్తాడు.. పోగొట్టుకున్నా ఇక్కడే.
సినిమాను ఓ ఫ్యాషన్‌గా భావించి సినిమాలు తీస్తూ ఇక్కడే ఉండడం ఆయనకు ఇష్టం. 20 ఏళ్ల నిర్మాత ప్రస్థానంలో ఆయన ప్రస్తుతం 50వ సినిమా తీస్తున్నాడు. ఇదో క్రేజీ ప్రాజెక్టు అవ్వాలనే ఆయన రామ్‌చరణ్ – ఏస్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ సెట్ చేశాడు. ఇక దిల్ రాజు బ్యానర్లో సమర్పకురాలిగా ఆయన ముందు భార్య పేరు అనిత ఉంటుంది. ఆయన కాచీగూడలో ఉండే నరసింహామూర్తి అనే సిద్ధాంతిని నమ్ముతారట. ఈ క్రమంలోనే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పెట్టినప్పుడు అనిత పేరు వచ్చేలా చూసుకుంటే కలిసి వస్తుందని చెప్పారట. అలా అనితను సమర్పకురాలిగా తన బ్యానర్ ముందు వేసుకునేవారు.
అయితే ఐదేళ్ల క్రితం ఆమె హఠాత్తుగా కార్డియాక్ ఆరెస్టుతో చనిపోయారు. ఆ తర్వాత మూడేళ్లు ఒంటరిగానే ఉన్నారు. అయితే రాజు కుమార్తెతో పాటు కుటుంబ సభ్యులు పట్టుబట్టడంతో రాజు తేజస్విని అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నారు. ఇదిలా ఉంటే రాజు చాలా ఇంటర్వ్యూల్లో తన మొదటి భార్యతో ఉన్న అనుబంధం చెప్పుకుని భావోద్వేగానికి లోనైన సందర్భాలు ఉన్నాయి. తాను సినిమాలు, షూటింగ్‌లతో ఎంత బిజీ ఉన్నా .. విదేశాల్లో షూటింగ్‌లు జరుగుతున్నప్పుడు అనితను కూడా తీసుకువెళ్లి.. ఆమెకు ఫ్యామిలీ లైఫ్ ఏ మాత్రం మిస్ కాకుండా చూసుకునేవాడిని అని చెప్పారు.
తాము చివరిగా ఎవడు షూటింగ్ విదేశాల్లో జరిగినప్పుడు కంటిన్యూగా వారం రోజుల పాటు కలిసే ఉన్నామని.. అన్ని రోజుల పాటు విదేశాల్లో ఉండడం అదే చివరి సారి అని చెప్పారు. ఇక రాజు వరుస హిట్లతో దూసుకుపోతోన్న సమయంలో అనిత .. ముందు తన పేరు సమర్పకురాలిగా ఉండడంతోనే నీకు కలిసి వచ్చిందని అనేవారట. అప్పుడు ఆయన తాను స్క్రిఫ్ట్‌లు జడ్జ్ చేయకుండా.. ఇంత కష్టపడకుండానే హిట్లు వచ్చేవా ? అని సరదాగా గొడవ పడేవారట. ఈ విషయాన్ని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు.
ఇక తన బ్యానర్ వెంకటేశ్వర స్వామి పేరు మీద పెట్టుకున్నామని.. అయితే తన బ్యానర్లో తీసిన సినిమాలకు రాముడు, కృష్ణుడు టైటిల్స్ పెట్టుకుంటే మాత్రం కలిసి రాలేదని ఇదో కో ఇన్సిడెంట్ అని చెప్పారు. రామరామ కృష్ణకృష్ణ – రామయ్యా వస్తావయ్యా – కృష్ణాష్టమి సినిమాలు తాము అనుకున్న రేంజ్‌లో సక్సెస్ కాలేదని చెప్పారు.