యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. బాహుబలి 1,2 సినిమాల తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ రెండు సినిమాలకు ముందు వరకు ప్రభాస్ కేవలం టాలీవుడ్‌లో ఆరడుగుల కటౌట్ లాంటి హీరో మాత్రమే. ఇప్పుడు ఏకంగా నేషనల్ స్టార్ అయిపోయాడు. ఈ బాహుబలి ఇమేజ్‌తోనే యావరేజ్ కంటెంట్‌తో వచ్చిన సాహో సినిమాతో కూడా బాలీవుడ్‌లో పాగా వేశాడు. సాహో సినిమా నార్త్‌లోనే ఏకంగా రు. 150 కోట్లు కొల్లగొట్టేసింది.
సాహో తర్వాత రాధేశ్యామ్ మామూలు సినిమా అభిమానులనే కాదు.. ప్రభాస్ వీరాభిమానులను సైతం తీవ్రంగా డిజప్పాయింట్ చేసింది. ఇప్పుడు ప్రభాస్ చేతిలో ఏకంగా ఐదారు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. అన్ని సినిమాలపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న సలార్ సినిమాపై మామూలు అంచనాలు లేవు. సలార్ 1, సలార్ 2 సినిమాలు లైన్లో ఉన్నాయి.
కేజీయఫ్ 1, 2 సినిమాలతో ప్రశాంత్ నీల్ ఒక్కసారిగా నేషనల్ వైడ్ పాపులర్ డైరెక్టర్ అయిపోయాడు. బాలీవుడ్ దర్శకులు సైతం రాజమౌళి వెంట ఎలా పడుతున్నారో ? ప్రశాంత్ నీల్ వెంట అలాగే పడుతున్నారు. అయితే ఈ నెల 14న కేజీయఫ్ 2 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఇక సలార్ కూడా లైన్లోనే ఉంది. సలార్‌పై కొన్ని రూమర్లు బయట బాగా స్ప్రెడ్ అవుతున్నాయి.
సలార్ కంప్లీట్ యాక్షన్ సినిమా. ఇది ప్రశాంత్ నీల్ ఫస్ట్ సినిమా ఉగ్రంకు రీమేక్ అని అంటున్నారు. ఇది డైరెక్ట్ రీమేక్ కాదని కొందరు చెపుతున్నా… దీనిపై ఎవ్వరూ క్లారిటీ ఇవ్వకపోవడంతో సస్పెన్స్‌గానే మిగిలిపోయింది. దీనిపై తాజాగా ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చేశారు. ఇది రీమేక్ సినిమా కానే కాదని.. ఈ సినిమాకు తన ఫస్ట్ సినిమాకు ఉగ్రంకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పేశారు.
ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సలార్ ఫస్ట్ పార్ట్ ఈ యేడాదే వస్తుందని అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఎప్పుడు అయితే రెండు పార్టులుగా తీసుకురావాలని మేకర్స్ డిసైడ్ అయ్యారో ఇక సలార్ ఈ యేడాది వచ్చే ఛాన్సులు లేవు. వచ్చే యేడాది సమ్మర్‌లో సలార్ పార్ట్ 1 రిలీజ్ అవుతోందంటున్నారు. ఇక ప్రభాస్ సినిమా కోసం ఫ్యాన్స్ అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.