ఒకప్పుడు దేవీశ్రీ ప్రసాద్ అంటే టాలీవుడ్ సినిమా జనాలే కాదు.. టాలీవుడ్ మ్యూజిక్ లవర్స్.. ఇటు సినీ లవర్స్ ఊగిపోయేవారు. దేవిశ్రీ మ్యూజిక్‌లోనూ, గొంతులోనూ ఏదో తెలియని మాయ ఉండేది. యువత అంతా ఫిదా అయిపోయేవారు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మన్మధుడు, సొంతం సినిమాల టైం నుంచే మనోడికి ఎంతో క్రేజ్ ఉండేది. ఒకానొక టైంలో స్టార్ హీరోలు సైతం దేవి మ్యూజిక్ కోసమే సినిమా వాయిదా పడితే వెయిట్ చేసిన రోజులు ఉండేవి. ఇక పదేళ్ల క్రితం రేసులోకి వచ్చిన థమన్ వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోయాడు. థమన్ స్పీడ్‌గా ఇచ్చేస్తాడన్న పేరున్నా దేవిశ్రీతో పోలిస్తే మ్యూజిక్ వీక్‌గా ఉంటుందన్న టాకే ఉండేది.
కట్ చేస్తే ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. థమన్ వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. పెద్ద చిన్నా అన్నా తేడా లేకుండా ప్రతి సినిమాకు ఒకేలా ఎఫర్ట్ పెట్టి పని చేస్తున్నాడు. థమన్ పాటలు యూట్యూబ్‌ను కంటిన్యూగా షేక్ చేస్తూనే ఉన్నాయి. అల వైకుంఠపురంలో, అఖండ లాంటి సినిమాలు థమన్‌ను ఎవ్వరూ టచ్ చేయని స్థాయికి తీసుకుపోయాయి.
ఇక ఇప్పుడు దేవిని టాలీవుడ్‌లో కంటిన్యూగా వాడిన డైరెక్టర్లు, పెద్ద పెద్ద బ్యానర్లు కూడా పక్కన పెట్టేస్తోన్న పరిస్థితే కనిపిస్తోంది. దిల్ రాజుకు ఒకానొక టైంలో దేవి ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్. తన మనస్సుకు నచ్చేలా మ్యూజిక్ ఇవ్వడంతో అసలు రాజు మరో చాలా సినిమాలకు మరో మ్యూజిక్ డైరెక్టర్‌ను పెట్టుకోవాలన్న ఆలోచన కూడా చేయలేదు. అందుకే తన సోదరుడు కుమారుడు ఆశిష్ తొలి సినిమాకు సైతం దేవినే తీసుకున్నారు.
సినిమా రిలీజ్ వరకు దేవి కూడా హైలెట్‌గా వార్తల్లో ఉన్నాడు. సినిమా విడుదల అయ్యాక వాళ్లకు సీన్ అర్థమైంది. సినిమా తేడా కొట్టేసింది. కథ, కథనాల కన్నా మ్యూజిక్ కూడా వీక్ అన్నది గ్రహించారు అన్న టాక్ ఒకటి బయటకు వచ్చింది. ఇక ఇప్పడు ఆశీష్ రెండో సినిమాకు దేవిని పక్కన పెట్టేసి గతంలో దిల్ రాజుకు అనేక హిట్ ఆల్బమ్ లు ఇచ్చిన మిక్కీ జె మేయర్ తీసుకున్నారు.
ఇది కాదు సమస్య… ఈ సినిమా సుకుమార్ రైటింగ్స్‌ది. తన సినిమాకు ఎవరెవరిని తీసుకోవాలో అన్నీ సుకుమారే డిసైడ్ చేస్తాడు. చిన్న సినిమా అనుకుని దేవీని తీసుకోలేదు అనుకోవడానికి లేదు. దిల్ రాజు బ్యానర్. కోట్లు కుమ్మరిస్తారు. ఆ ఇబ్బంది లేదు. అయితే వాళ్లు అనుకున్న అవుట్ ఫుట్ వస్తుందా ? లేదా ? అన్నది వాళ్ల ప్లాన్. అందుకే దేవినీ పక్కన పెట్టేసి మిక్కీని తీసుకున్నారు. ఏదేమైనా టాలీవుడ్ బడా బ్యానర్లు, అగ్ర నిర్మాతలే దేవీని పక్కన పెడుతుండడం ఆలోచించాల్సిన విషయం.