దర్శకధీరుడు రాజమౌళి తాజా క్రేజీ పాన్ ఇండియా సినిమా త్రిబుల్ ఆర్ వసూళ్లతో దూసుకు వెళుతోంది. ఇప్పటికే ఫస్ట్ వీక్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రు. 710 కోట్ల వసూళ్లు రాబట్టింది. టాలీవుడ్‌లోనే స్టార్ హీరోలుగా ఉన్న మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి ఈ సినిమాలో నటించారు. ఇద్దరు స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను బేస్ చేసుకుని ఫిక్షన్ కథతో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ మనదేశంలోనే కాకుండా.. మన దేశం బయట కూడా ఎన్నో సంచలనాలు క్రియేట్ చేస్తోంది.
ఓవర్సీస్‌లో అయితే ఇప్పటికే 11 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టింది. ఇక మరో రు. 60 కోట్ల వస్తే ఈ సినిమా ఓవరాల్‌గా బ్రేక్ ఈవెన్ అయిపోయినట్టే.. కేజీయఫ్ 2 సినిమా వచ్చే వరకు ఇతర పెద్ద సినిమాలు ఏవీ థియేటర్లలోకి రావడం లేదు. సో మరో రెండు వారాల పాటు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దున్నేసుకోవచ్చు. అప్పటి లోగా బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లోకి వచ్చేస్తుందనడంలో సందేహం లేదు. రాజమౌళి అయితే ఫుల్ ఖుషీగా ఉన్నాడు.
ఈ క్రమంలోనే రెండు నెలలు గ్యాప్ తీసుకుని మహేష్‌బాబుతో తాను చేయబోయే అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమాకు వర్క్ స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాకు ఇప్పటికే స్టోరీ రైటర్ విజయేంద్రప్రసాద్ ఈ సినిమా కోసం ఆఫ్రికా అడవుల నేపథ్యంలో అదిరిపోయే అడ్వెంచర్ స్టోరీ రెడీ చేశామని కూడా చెప్పాడు. ప్రస్తుతం మహేష్ పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా కంప్లీట్ చేసుకుని.. దసరా నుంచి రాజమౌళి సినిమాకు యాడ్ అవుతాడు.
ఈ లోగా రాజమౌళి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు అన్నీ కంప్లీట్ చేసుకుంటాడు. ఇక మహేష్ అభిమానులు ఎప్పటి నుంచో రాజమౌళితో తమ హీరో సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు. సింహాద్రి తర్వాత నుంచే ఈ కాంబినేషన్ ఎప్పుడు వస్తుందా ? అని వెయిట్ చేస్తోన్న వాళ్ల కోరిక ఎట్టకేలకు ఇప్పుడు తీరబోతోంది. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే ఈ సినిమాపై ఓ క్రేజీ బజ్ బయటకు వచ్చేసింది.
ఈ సినిమాకు రు. 800 కోట్ల భారీ బడ్జెట్ పెట్టారని.. నిర్మాత దుర్గా ఆర్ట్స్ అధినేత డాక్టర్ కేఎల్. నారాయణ ఇంత బడ్జెట్ పెట్టలేరనే.. మరో నిర్మాత దిల్ రాజును కూడా కలుపుకుని ఆయనకు కూడా వాటా ఇస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇవన్నీ అబద్ధాలే అని.. ఈ సినిమాకు ఫైనల్‌గా రు. 500 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు తెలిసింది. త్వరలోనే ఈ సినిమా పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.