Moviesపోలీస్ పాత్ర‌లో పోటీప‌డ్డ చిరు-నాగ్‌-వెంకీ-బాల‌య్య‌.. గెలిచింది ఎవ‌రంటే...?

పోలీస్ పాత్ర‌లో పోటీప‌డ్డ చిరు-నాగ్‌-వెంకీ-బాల‌య్య‌.. గెలిచింది ఎవ‌రంటే…?

టాలీవుడ్‌లో సీనియ‌ర‌ల్ స్టార్ హీరోలైన చిరంజీవి, నాగార్జున‌, వెంక‌టేష్‌, బాల‌కృష్ణ‌ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 90ల‌లో ఈ న‌లుగురు హీరోల మ‌ధ్య పోటీ వేరె లెవ‌ల్‌లో ఉండేది. అయితే ఒక‌సారి అనూహ్యంగా ఈ న‌లుగురు పోలీస్ పాత్ర‌లో పోటీప‌డ్డారు. కానీ, చివ‌ర‌కు గెలిచింది మాత్రం ఒక్క‌రే. మ‌రి ఆ ఒక్క‌రు ఎవ‌రు..? అస‌లు ఈ న‌లుగురు హీరోలు ఏయే సినిమాల‌తో పోటీ ప‌డ్డారు..? అనేవి తెలియాలంటే లేట్ చేయ‌కుండా కింద‌కు ఓ లుక్కేసేయండి.

కింగ్ నాగార్జున హీరోగా ప్రియదర్శన్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చిత్రం `నిర్ణయం`. ఇందులో అమల హీరోయిన్‌గా న‌టించింది. పెళ్లికి ముందు నాగ్ తో అమ‌ల‌ కలిసి నటించిన ఆఖరి సినిమా ఇది. శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మైన ఈ చిత్రానికి నిజాయితీ గల పోలీస్ ఆఫీస‌ర్‌గా నటించాడు. మలయాళంలో మోహన్ లాల్ చేసిన సూప‌ర్ హిట్‌ ‘వందనం’ కు ఇది రీమేక్‌. 1991 ఫిబ్రవరి 21 విడుదలైన నిర్ణయం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో విఫలం అయింది.

ఆ త‌ర్వాత చిరంజీవి `ఎస్.పి.పరశురాం`తో వ‌చ్చేశాడు. రవిరాజా పినిశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని అల్లు అర‌వింద్ నిర్మించ‌గా.. శ్రీదేవి హీరోయిన్‌గా చేసింది. `వాల్టర్ వెట్రివేల్` అనే తమిళ చిత్రానికి ఇది రీమేక్. 1994 మార్చి 4న విడుద‌లైన ఈ సినిమాలో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ ప‌ర‌శురామ్‌గా చిరు త‌న‌దైన న‌ట‌న‌తో అద‌ర‌గొట్టేశారు. కానీ, ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది.

అదే ఏడాది `సూప‌ర్ పోలీస్‌`గా వెంక‌టేష్ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. కె.మురళీమోహన్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో నగ్మా, సౌందర్య హీరోయిన్లుగా చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. సురేష్ బాబు నిర్మించిన ఈ యాక్ష‌న్ మూవీ సైతం అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది.

ఇక ఆ స‌మ‌యంలోనే `రౌడీ ఇన్స్పెక్టర్`గా బాల‌య్య దిగాడు. బి. గోపాల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో విజయశాంతి హీరోయిన్‌గా న‌టించింది. అన్యాయాన్ని అంతమొందించడానికి పోలీస్ రౌడీలాగా ప్రవర్తించక తప్పదు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. 1992లో రిలీజ్ అయిన ఈ మూవీ ఘ‌న విజ‌యం సాధించింది. అలాగే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. అలా పోలీస్ పాత్ర‌లో పోటీప‌డ్డ న‌లుగురు హీరోల్లో చివ‌రాఖ‌ర‌కు బాల‌య్య‌నే గెలిచారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news