మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. సైరా తర్వాత మూడేళ్ల పాటు గ్యాప్ వచ్చింది. కోవిడ్‌తో పాటు అనేక కారణాలు ఆచార్య సినిమాను లేట్ చేశాయి. ఆచార్య ఎట్టకేలకు ఈ నెల 29న థియేటర్లలోకి వస్తోంది. ఇదిలా ఉంటే వచ్చే సంక్రాంతికి మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న చిరు మధ్యలో జూలై లేదా ఆగస్టులో గాడ్‌ఫాదర్ సినిమాతో మరోసారి స్వల్ప వ్యవధిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గాడ్‌ఫాదర్ షూటింగ్ కూడా దాదాపు 90 శాతం పూర్తయ్యింది.
ఒకేసారి గాడ్ ఫాదర్‌తో పాటు అటు మెహర్ రమేష్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న భోళా శంకర్ సినిమా.. ఇటు బాబి దర్శకత్వంలో 154వ సినిమాలు చేస్తున్నాడు. అంటే ఆచార్యతో కలుపుకుంటే వచ్చే సమ్మర్ లోగా చిరు మొత్తం 4 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మెగాభిమానులకు అంతకు మించిన ఆనందం ఏం ఉంటుంది ? ఇక ఈ మూడు సినిమాల తర్వాత డీవీవీ దానయ్య వెంకీ కుడుముల దర్శకత్వంలో నిర్మించే పవర్ ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్‌లో కూడా చిరు నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడు.
ఇదిలా ఉంటే బాబి దర్శకత్వంలో చిరు నటిస్తోన్న 154వ సినిమాలో శృతీహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీస్ వాళ్లు భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సెట్స్‌లోకి శృతి కూడా ఎంటర్ అయ్యింది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు. మాస్ మసాలా ఎంటర్టైనర్గా తెరకెక్కే ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో రవితేజ చిరుకు తమ్ముడిగా నటిస్తున్నారని టాక్ ?
ఇక ఈ సినిమా టైటిల్‌కు సంబంధించి ఎప్పటి నుంచో ఓ వార్త అయితే ప్రచారంలో ఉంది. వైజాగ్ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందని.. అందుకే వాల్తేరు వీరయ్య అన్న టైటిల్ పెడుతున్నారని అన్నారు. అక్కినేని మనవడు సుమంత్ హీరోగా వాల్తేరు శీను అన్న టైటిల్‌తో ఓ సినిమా అనుకున్నారు. ఆ టైటిల్ తమ టైటిల్‌కు దగ్గరగా ఉండడంతో మార్చకోమని కోరిన వెంటనే ఆ సినిమా టీం తమ టైటిల్ కూడా మార్చుకుంది.
అయితే ఈ సినిమాకు నిజంగా వాల్తేరు వీరయ్య టైటిల్ పెడతారా ? అన్న డౌట్ ఉండేది. అయితే ఈ రోజు డ్యానస్ మాస్టర్ శేఖర్ ఈ టైటిల్ లీక్ చేసేశారు. ఆయన తాజా ఇంటర్వ్యూలో అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చెపుతూ రవితేజ ధమాకా, రామారావు ఆన్ డ్యూటీతో పాటు చిరంజీవి గారి భోళాశంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలు ఉన్నాయని చెప్పాడు. అంటే మెగా 154 వాల్తేరు వీరయ్య అన్నది ఆయన కన్‌ఫార్మ్ చేసేసినట్టు అయ్యింది.
గతంలో ఓ సినిమా ఫంక్షన్లో చిరు పొరపాటున ఆచార్య టైటిల్ కూడా ఇలాగే లీక్ చేసేశారు. ఇప్పుడు వాల్తేరు వీరయ్య టైటిల్ కూడా అలాగే లీక్ అయ్యింది. అయితే ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో దర్శకుడు బాబి కాస్త అసహనంగానే ఉన్నాడని అంటున్నారు.