టాలీవుడ్ యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి తమ కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో నటించారు. చిరుది ఇండస్ట్రీలో 40 ఏళ్ల ప్రస్థానం అయితే.. ఇటు ఎన్టీఆర్‌ది కూడా 20 ఏళ్ల ప్రస్థానం. ఎన్టీఆర్ చిన్న వయస్సులోనే ఇండస్ట్రీలోకి వచ్చి చిన్న ఏజ్‌లోనే సూపర్ డూపర్ హిట్లు కొట్టేశాడు. స్టూడెంట్ నెంబర్ వన్ – ఆది – సింహాద్రి సినిమాలు ఎన్టీఆర్‌కు చిన్న వయస్సులోనే తిరుగులేని స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టాయి.
అసలు అంతకన్నా ముందే ఎన్టీఆర్ చిన్నప్పుడే గుణశేఖర్ దర్శకత్వంలో బాల రామాయణం సినిమా చేసి తెలుగు ప్రేక్షకుల మదిలో అలా నిలిచిపోయాడు. ఆ సినిమా ఆ రోజుల్లోనే 100 రోజులు ఆడింది. ఈ సినిమా శతదినోత్సవ ఫంక్షన్‌లో ఎన్టీఆర్ మాట్లాడుతూ ఇచ్చిన స్పీచ్ అందరిని ఆకట్టుకుంది. రేపు తాను పెద్దయ్యాక తన సినిమాలు ప్లాప్ అయితే లైట్‌బాయ్‌గా అయినా తాను సినిమా ఇండస్ట్రీలోనే ఉంటానని చెప్పారు.
ఈ విషయాలు అన్నీ సీనియర్ జర్నలిస్టు భరద్వాజ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ముందుగా మరో డైరెక్టర్‌తో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమా సరిగా రాకపోవడంతో కథ మార్చి.. రాజమౌళి డైరెక్షన్‌లో సింహాద్రి తీశారని కూడా భరద్వాజ చెప్పారు. ఇక ఆది తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయిందని.. ఎన్టీఆర్ స్టార్ హీరో అయిపోయాడని భరద్వాజ తెలిపారు.
ఎన్టీఆర్ నటించిన అల్లరి రాముడు, చిరంజీవి నటించిన ఇంద్ర సినిమాలు ముందుగా ఒకే రోజు రిలీజ్ ప్లాన్ చేసుకున్నారట. ఈ రెండు సినిమాలకు దర్శకుడు బి.గోపాల్.. పైగా రెండు సినిమాల్లోనూ ఆర్తీ అగర్వాల్ హీరోయిన్. ఆది లాంటి హిట్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో అల్లరి రాముడుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ సినిమా రోజునే తన సినిమా కూడా రిలీజ్ చేస్తే.. ఒకవేళ తన సినిమా అటూ ఇటూ అయితే రిస్క్ ఎందుకని ? భావించి చిరంజీవి తన సినిమాను వారం రోజులు వెనకకు జరిపించారని భరద్వాజ చెప్పారు.
అలా ఆ రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ తన క్రేజ్‌తో చిరంజీవినే కాస్త డైలమాలో పడేశారని కూడా భరద్వాజ చెప్పారు. ఇక ఆరు రోజుల గ్యాప్‌లో రిలీజ్ అయిన ఈ రెండు సినిమాల్లో అల్లరి రాముడు యావరేజ్ అయినా కమర్షియల్‌గా మాత్రం సూపర్ హిట్టే..! ఇక ఇంద్ర సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఆ రోజుల్లోనే ఇంద్ర 122 కేంద్రాల్లో 100 రోజులు ఆడి సంచలనం క్రియేట్ చేసింది.