కోట్లాది మంది మెగా అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా..”ఆచార్య”. కొరటాల శివ డైరెక్షన్ లో చిరంజీవి-చరణ్ హీరోలుగా దాదాపు మూడేళ్ళు కష్టపడి తెరకెక్కించారు ఆచార్య’ సినిమాని. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా..కరోనా కారణంగా కొన్ని సార్లు.. ఇతర ఇతర కారణాల చేత కొన్ని సార్లు వాయిదా పడుతూ.. విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 29వ తేదీన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసింది యూనిట్.
ఇందులో భాగంగానే రీసెంట్ గా హైదరబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరిపారు చిత్ర బృందం. అంతా బాగా మ్యానేజ్ చేశారు..బాగా జరిగింది కానీ..ఓ విషయంలో ఇరుక్కునేసింది ఆచార్య టీం. సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండగా కేవలం పూజానే హైలెట్ చేస్తూ పొగిడేశారు. దీంతో మరో హీరోయిన్ కాజల్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. కనీసం ఆమె తల్లి అయిన విషయాని అయిన స్టేజీ పై చెప్పి రెండు ముక్కలు మాట్లాడితే బాగుండేది అని కామెంట్ చేస్తున్నారు. దీంతో రెండు రోజులుగా ఆచార్యలో కాజల్ రోల్ పై హాట్ డిస్కషన్ నడుస్తుంది.
కాగా, రీసెంట్ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న రామ్ చరణ్ కు ఇదే విషయమై ప్రశ్న ఎదురైంది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆచారయ చిత్రంలో కాజల్ రోల్ ఎలా ఉంటుందని క్వశ్చన్ అడగ్గా..ఈ విషయమై రామ్ చరణ్ చేసిన కామెంట్స్ కొత్త డౌట్లు పుట్టిస్తున్నాయి. చరణ్ మాట్లాడుతూ..”‘ఆచార్య’ సినిమా షూటింగ్ జరిగే టైం లో నేను RRR సినిమా లో బిజీ గా ఉన్నాను. సో, దీంతో నాకు ఆచార్యలో ఏం జరుగుతుందో తెలియకుండాపోయింది.
నాన్నతో కాజల్ చిన్న చిన్న పోర్షన్స్ చేశారని విన్నా..అంతే కానీ, దీనికి సంబంధించి నాకు ఏం తెలియదు.. ఇప్పటి వరకు నేను ఫైనల్ ఎడిట్ కూడా చూడలేదు కాబట్టి ఆమె రోల్ గురించి నాకు ఏం తెలియదు..నా వద్ద ఎలాంటి సమాచారం లేదు” అని రామ్ చరణ్ చెప్పడంతో ఇప్పటికే ఉన్న కాజల్ రోల్ పై అనుమానాలకు రెక్కలు కట్టింది. సో.. చూడాలి మరి ఆచార్యలో కాజల్ రోల్ ఉంటుందా? లేక గెస్ట్ రోల్ గా నే ట్రీట్ చేశారా అనేది..?