వాస్తవాలు ఏమిటో ఆ దేవుడికే ఎరుక. ఇప్పుడు ఈ విషయం మాత్రం టాలీవుడ్ వర్గాల్లో బాగా వైరల్ అవుతోంది. టాలీవుడ్ లో పలువురు దర్శకులు.. పిఆర్వోల మధ్య కూడా ఇప్పుడు ఈ విషయం బాగా చర్చకు వస్తోంది. నాలుగేళ్లపాటు ఎంతో ఇష్టంగా ప్రేమించుకున్నారు నాగచైతన్య – సమంత. 2017లో పెళ్లి చేసుకున్న ఈ జంట మరో నాలుగేళ్లపాటు ఎంతో అన్యోన్యంగా కాపురం చేశారు. వీరి మధ్య మనస్పర్థలు తలెత్తే నాలుగు నెలలకే వీరు విడిపోయారు.
ఎంతో అన్యోన్యంగా ప్రేమించిన సమంతకు విడాకులు ఇచ్చిన నాగచైతన్య ఇప్పుడు మరో హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో ఇండస్ట్రీ వర్గాల్లో బాగా వైరల్ అవుతోంది. సదరు హీరోయిన్‌కు కూడా తెలుగునాట మంచి అభిమానులు ఉన్నారు. ఆ హీరోయిన్ సమంతలా ఎక్స్పోజింగ్ చేసేందుకు ఏమాత్రం ఇష్టపడదు. సినిమాల్లో కూడా చాలా పద్ధతిగా… సాంప్రదాయ పాత్రల్లో మాత్రమే నటిస్తోంది. కేవలం నటనతోనే ఆ హీరోయిన్ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.
సెట్స్‌లో హీరోలను సైతం డామినేట్ చేస్తుందని.. ఏ చిన్న విషయంలోనూ వెనక్కు తగ్గదన్న పేరు కూడా తెచ్చుకుంది. సదరు హీరోయిన్ తో కలిసి చైతన్య ఒక సినిమాలో నటించాడు. ఇటీవల వారిద్దరూ కలిసి ప్రేమ పక్షుల్లా వ్యవహరిస్తున్నారన్న వార్తలే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలు కోడై కూస్తున్నాయి. అయితే ఈ ప్రేమ వార్తలపై నాగచైతన్య కానీ సదరు హీరోయిన్ కానీ ఇంతవరకు స్పందించలేదు. వీరిద్దరూ కలిసి ఉన్న ఒక ప్రైవేట్ పిక్ వైరల్ అవడంతో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలు కూడా వీరు ప్రేమలో ఉన్న మాట నిజమే నమ్ముతున్నారు.
ఇప్పటికే నాగచైతన్యతో ఒక సినిమాలో నటించిన ఆ హీరోయిన్ ఇప్పుడు… మరో కొత్త సినిమాలో కూడా అతడితో కలిసి నటిస్తుండడంతో రకరకాల పుకార్లు బయటకు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలో ఆ హీరోయిన్‌తో నాగచైతన్య కెమిస్ట్రీ ఒక రేంజ్లో పడింది. మరి ఈ హీరోయిన్ తో ఆయన నాగ చైతన్య రీల్ కెమిస్ట్రీ… రియల్ గా కూడా వర్కవుట్ అయ్యి సక్సెస్ అవుతుందేమో ? చూడాలి.