ప్రముఖ ఇండో – కెనడియన్ పోర్న్ స్టార్ సన్నీలియోన్‌కు కేవలం మన దేశంలో మాత్రమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా పోర్న్ ఫ్యాన్స్ ఉన్నారు. అసలు సన్నీ శృంగార వీడియోలకు ఎంత పిచ్చ క్రేజ్ ఉంటుందో… ఆమె పోర్న్ వీడియోల కోసం పోర్న్ లవర్స్ ఎంతలా పడి చస్తారో చెప్పక్కర్లేదు. గూగుల్ సెర్చింగ్‌లో రెండేళ్ల పాటు ఆమె భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీని కూడా వెనక్కు నెట్టేసి సెర్చింగ్‌లో టాప్ పర్సన్‌గా నిలిచింది.
అంటే సన్నీ లియోన్ పోర్న్ వీడియోలు కావచ్చు.. ఆమె గురించి తెలుసుకునేందుకు భారతీయులు ఎంత ఆసక్తితో ఎదురు చూస్తున్నారో.. ఆమెకు ఏ రేంజ్లో ఫాలోయింగ్ ఉందో చెప్పేందుకు ఇదే నిదర్శనం. పోర్న్ సినిమాలకు దూరమయ్యాక వెండితెరపై వెలిగేందుకు ఆమె బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె తెలుగుతో పాటు తమిళ్ సినిమాలు కూడా చేసింది.
గతంలో తెలుగులో మంచు వారబ్బాయ్ మనోజ్ నటించిన కరెంటు తీగ సినిమాలో ఐటెం సాంగ్ చేసిన సన్నీ ఇప్పుడు మంచు విష్ణుతో కలిసి మరో సినిమా చేస్తోంది. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా రైతులు సైతం తమ పొలాల్లో పండించే పంటలకు దిష్టి తగలకుండా ఉండేందుకు సన్నీ లియోన్ హాట్ బొమ్మలను పొలాల్లో కడుతున్నారు.
తాజాగా కర్నాకటకు చెందిన సన్నీలియోన్ వీరాభిమాని ఒకరు చికెన్ షాప్ నిర్వహిస్తున్నాడు. సన్నీకి వీరాభిమాని అయిన అతడు తన షాపులో ఎవరైనా చికెన్ కొంటే.. అది కూడా సన్నీలియోన్ అభిమానులు అయ్యి ఉంటే వాళ్లకు 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు బంపర్ ఆఫర్ ప్రకటించాడు. ఈ ఆఫర్ ఉందంటే అందరూ కూడా సన్నీలియోన్ అభిమానులమే అని చెప్పుకుంటారు.
అందుకే అతడు తెలివిగా మరో కండీషన్ కూడా పెట్టాడు. సన్నీ అభిమానులం అని చెప్పుకోవడమే కాదు.. వాళ్లు సోషల్ మీడియాలో సన్నీని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సన్నీ లియోన్ ఫొటోలను తమ ఫోన్లలో డౌన్ లోడ్ కూడా చేసుకోవాలి. చివరగా సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు, వీడియోలకు లైకులు కొట్టి. కామెంట్లు పెట్టి ఉండాలి. ఈ కండీషన్స్‌ను అనుసరించే ఆ షాపు యజమాని తన కొట్లో డిస్కౌంట్ ఇస్తున్నాడు.