సినిమా ఇండస్ట్రీకి చెందిన వారికి క్రికెట్ రంగంలో ఉన్న వారితో ప్రేమలు, పెళ్లిళ్లు అనేవి కామన్. ఇది ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో చాలా కామన్ అయిపోయింది. ఇది ఇప్పటి నుంచే కాదు గత కొన్ని దశాబ్దాల నుంచే ఉంది. టీం ఇండియా క్రికెటర్లు హీరోయిన్లు లేదా ఇండస్ట్రీకి చెందిన వారిని ప్రేమించడాలు.. డేటింగులు చేయడాలు చాలా రోజుల నుంచే ఉన్నాయి. కొన్ని జంటలు పెళ్లికి ముందే బ్రేకప్‌లు చెప్పుకుంటే.. మరి కొందరు పెళ్లి వరకు కూడా వెళ్లారు. బాలీవుడ్‌కు, క్రికెట్‌కు అవినాభావ సంబంధమే ఉంది.
ప్రస్తుతం బాలీవుడ్ క్రేజీ హీరోయిన్, టీం ఇండియా స్టార్ క్రికెటర్ ప్రేమాయణం ఒకటి బాగా వార్తల్లో నిలుస్తోంది. గత ఐదారేళ్లుగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ – అనుష్క శర్మ ప్రేమాయణం ఎంతలా వార్తల్లో నానిందో చూశాం. ఇప్పుడు కూడా అలాంటి ఇంట్రస్టింగ్ ప్రేమాయణమే హైలెట్ అవుతోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు స్టార్ హీరో సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి, టీం ఇండియా క్రికెటర్ కేఎల్. రాహుల్ మధ్య ప్రేమాయణం మామూలుగా లేదట.
వీరిద్దరు కలిసి పీకల్లోతు ప్రేమలో మునిగిపోయినట్టు తెలుస్తోంది. వీరిద్దరు కలిసి గత మూడేళ్లుగా తెగ తిరిగేస్తున్నారు. అయితే కరోనాతో పాటు రకరకాల కారణాల వల్ల వీరిద్దరు తెగ తిరిగేస్తున్నా పెళ్లి మాత్రం జరగడం లేదు. ఇక 2022లో వీరి పెళ్లి ఖచ్చితంగా జరగబోతోందని తెలుస్తోంది. వీరి పెళ్లి కూడా జరగకుండానే వీరిద్దరు కలిసి అపార్ట్మెంట్ కూడా బుక్ చేసుకున్నారట.
వీరు సీక్రెట్‌గా ముంబైలో ఆ అపార్ట్మెంట్లోనే కలుసుకుంటున్నారని కూడా టాక్ ? రాహుల్ ఈ అపార్ట్‌మెంట్‌కు నెలకు రు. 10 లక్షలు చెల్లిస్తున్నాడని.. ముంబైలో సముద్రం ఒడ్డున.. అత్యంత ఖరీదైన అపార్ట్మెంట్ అదే అని అంటున్నారు. బీచ్ ఫేసింగ్ కలిగిన అపార్ట్మెంట్ కావడంతోనే వీరు అక్కడ ఉండేందుకు బాగా ఇష్టపడుతున్నారని బీ టౌన్ టాక్ ?
సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి ఒక్కటే వార్తలు బయటకు వస్తున్నా కూడా వీరిద్దరు చాలా కూల్‌గానే తమ వ్యవహారాలు కానిచ్చేస్తున్నారు. ఎక్కడా కూడా ఎవ్వరూ నోరు మెదపడం లేదు. తమ పని తాము చేసుకుపోతున్నారు. త్వరలోనే వీరి పెళ్లి గురించి అధికారికంగానే అనౌన్స్మెంట్ కూడా వస్తుందని అంటున్నారు.