ప్రస్తుతం రష్మిక మందన్న పేరు చెపితే నేషనల్ క్రష్మిక అన్న ట్యాగ్‌లైన్ వచ్చేసింది. రష్మిక కేవలం సౌత్ సినిమాను మాత్రమే కాదు.. అటు నార్త్ సినిమాను కూడా ఏలేస్తోంది. ఇక తెలుగులో అయితే రష్మికను వరుస పెట్టి స్టార్ హీరోలు అటూ ఇటూ తిప్పేస్తున్నారు. నేషనల్ క్రష్‌గా తక్కువ టైంలోనే పాపులర్ అయిన రష్మిక తాజాగా కోలీవుడ్ ఇళయ దళపతి విజయ్ హీరోగా వస్తోన్న 66వ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. దిల్ రాజు బ్యానర్లో మన తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఇక బాలీవుడ్‌లో అయితే పెద్దగా కష్టపడకుండానే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. చివరకు బాలీవుడ్‌లో బిజీ కావడంతోనే రష్మిక ముంబైలో పెద్ద ప్లాట్ కూడా తీసేసుకుంది. రెండు హిందీ సినిమాల్లో నటిస్తోన్న రష్మిక.. బన్నీ పుష్ప సినిమాతో నార్త్ ఆడియెన్స్‌కు కూడా బాగా కనెక్ట్ అయిపోయింది. శ్రీ వల్లి పాత్ర ఆమెను ఇండియా వైజ్‌గా అన్ని భాషల్లో ఉన్న సినీ ప్రేమికులకు బాగా కనెక్ట్ చేసింది.
ఇటు సౌత్‌లో తెలుగు, తమిళ్‌తో పాటు సొంత భాష కన్నడంలోనూ తిరుగులేని హీరోయిన్ అయిపోయింది. చివరకు ఆమె కన్నడ ఇండస్ట్రీలో నటించే ఛాన్స్ కూడా దొరకనంత బిజీ హీరోయిన్ అయిపోయింది. ఒకానొక టైంలో ఆమెను కన్నడ సినిమా ఇండస్ట్రీయే గుర్తించింది. తెలుగులో నితిన్ సరసన ఛలో సినిమాలో నటించింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో అసలు తెలుగులో స్టార్ హీరోలు వరుస పెట్టి ఆఫర్లు ఇచ్చుకుంటూ పోయారు.
చివరకు ఆమె కన్నడ సినిమాల్లో నటించడం మానేయడంతో అక్కడ ప్రేక్షకులు రష్మిక మీద గుర్రుగా కూడా ఉన్నారు. రష్మికను హీరోయిన్‌ను చేసిన సొంత భాష ప్రేక్షకులను, ఇండస్ట్రీని ఆమె మర్చిపోయిందని విమర్శలు చేస్తున్నారు. అయితే రష్మికకు 20 ఏళ్ల వయస్సులోనే కన్నడ హీరో రక్షిత్‌తో ఎంగేజ్‌మెంట్ అయ్యింది. వీరి పెళ్లికి ఏర్పాట్లు జరుగుతుండగా తెలుగులో ఛలో, గీతగోవిందం సినిమాల్లో వరుసగా ఆఫర్లు రావడం.. అవి హిట్ అవ్వడం.. వెంటనే మహేష్‌బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా ఛాన్స్ రావడంతో ఆమె పెళ్లిని కొద్ది రోజులు వాయిదా వేయాలని కోరింది.
అయితే అందుకు రక్షిత్ ఫ్యామిలీ ఒప్పుకోలేదు. చివరకు రష్మిక డేరింగ్ డెసిషన్ తీసుకుని పెళ్లిని క్యాన్సిల్ చేసేసుకుంది. ఒకవేళ నిజంగా రష్మిక.. రక్షిత్‌ను పెళ్లి చేసుకుని ఉంటే ఈ రోజు ఆమె తెలుగు, సౌత్ ఇండియాలోనే కాదు.. పాన్ ఇండియా వైజ్‌గా స్టార్ హీరోయిన్ అయ్యేఛాన్స్ మిస్ అయ్యి ఉండేది. పెళ్లి చేసుకుని ఉంటే ఒకరో ఇద్దరో బిడ్డలను కని గృహిణిగా మిగిలిపోయేది.