నందమూరి నటసింహం బాలయ్య కెరీర్‌లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. బాలయ్యతో ఎంతో మంది దర్శకులు పనిచేసి.. ఎన్నో హిట్లు ఇచ్చారు. అయితే బాలయ్యకెరీర్ ఒక్కసారిగా డల్ అయ్యిందిరా అనుకుంటోన్న టైంలో తిరుగులేని బ్లాక్‌బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు ఇచ్చి బాలయ్యను తెలుగు సినిమా శిఖరాగ్రాని నిలబెట్టిన దర్శకుల్లో ముందు బి. గోపాల్, ఇప్పుడు బోయపాటి శ్రీను ఉంటారు. బాలయ్య – బి. గోపాల్ కాంబినేషన్లో ఐదు సినిమాలు వస్తే నాలుగు సూపర్ డూపర్ హిట్లు. ఇక ఇప్పుడు బాలయ్యది బోయపాటిది సూపర్ హ్యాట్రిక్ కాంబినేషన్.
బాలయ్య – బి. గోపాల్ కాంబోలో లారీడ్రైవర్ – రౌడీఇన్‌స్పెక్టర్- సమరసింహారెడ్డి – నరసింహానాయుడు – పలనాటి బ్రహ్మనాయుడు వస్తే చివరి సినిమా ఒక్కటే ప్లాప్. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు అయితే ఇండస్ట్రీ హిట్లే..! ఈ క్రమంలోనే 1992లో వచ్చిన రౌడీ ఇన్‌స్పెక్టర్ సూపర్ హిట్. విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత టి. త్రివిక్రమ రావు నిర్మించిన ఈ సినిమాలో విజయశాంతి హీరోయిన్. బాలయ్య పవర్ ఫుల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా కనిపించారు.
బాలయ్య పవర్ ఫుల్ పోలీస్‌గా జీవించేందుకు సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు తాను తన స్పాట్ నుంచే లొకేష్‌ను ఇన్‌స్పెక్టర్ డ్రెస్‌లో రావడంతో పాటు పోలీస్ జీప్ కావాలని కండీషన్ పెట్టారట. ఆయన కోరిక మేరకు దర్శకుడు గోపాల్ షూటింగ్ జరిగినన్ని రోజులు పోలీస్ జీప్ ఆయనకు ఎరేంజ్ చేశారట. ఈ పోలీస్ డ్రెస్ తీసేస్తే.. నేను నీకన్నా పెద్ద రౌడీనురా ? ఏ సెంటర్‌కు రాను.. జగదాంబ – సంగం- శరత్ అని చెప్పే డైలాగ్‌కు థియేటర్లో విజిల్స్, కేకలే..!
అయితే ఈ సినిమా ఎప్పటకీ చెక్కు చెదరని రికార్డు తన ఖాతాలో వేసుకుంది. ఆ రోజుల్లోనే లాంగ్ రన్‌లో రు. 7.5 కోట్ల షేర్ కొల్లగొట్టిన ఈ సినిమా పలు కేంద్రాల్లో 175 రోజులతో పాటు కొన్ని చోట్ల 200 రోజులు కూడా ఆడింది. అలాగే తెలుగు – తమిళం – హిందీలో 175 రోజులు ఆడిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఈ రికార్డు ఇప్పటకీ ఏ హీరోకు కూడా లేదు. బాలయ్యకు మాత్రమే సాధ్యమైన రికార్డుగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ రికార్డు ఇప్పటకీ ఎవ్వరూ బ్రేక్ చేయలేదు.
పరుచూరి బ్రదర్స్ పవర్ ఫుల్ డైలాగులు, బాలయ్య పవర్ ఫుల్ యాక్టింగ్, బప్పిలహరి మ్యూజిక్, బి. గోపాల్ టేకింగ్, బాలయ్య – విజయశాంతి కాంబినేషన్ ఇవన్నీ సినిమాను ఎక్కడికో తీసుకువెళ్లాయి. చాలా రోజుల పాటు బాలయ్య అభిమానులు బాలయ్య ఈ సినిమాలో పోషించిన పాత్ర మానియాలో మునిగి తేలిపోయారు.