Moviesకొర‌టాల‌పై కోపంతో ' ఆచార్య‌ ' ను బ‌లి చేస్తున్నారా..!

కొర‌టాల‌పై కోపంతో ‘ ఆచార్య‌ ‘ ను బ‌లి చేస్తున్నారా..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది. తొలిసారిగా చిరంజీవితో పాటు ఆయన తనయుడు రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా కావడంతో ఆచార్యపై భారీ
అంచనాలు ఉన్నాయి. ఈ ప్రెస్టీజియస్ సినిమాకు ఇప్పుడు నైజాంలో థియేటర్ల సమస్య ఏర్పడినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. నైజాంలో ఇటీవల ఏ పెద్ద సినిమా వచ్చినా ఆ సినిమా హక్కులు అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం అవుతున్నాయి. ఇటీవల వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాటు కేజిఎఫ్ 2 సినిమా రైట్స్ రాజు సొంతం చేసుకున్నారు. ఈ రెండు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

నైజాంలో ఉన్న థియేటర్లలో ఇప్పుడు మెజార్టీ థియేటర్లలో త్రిబుల్ ఆర్ సినిమాతో పాటు కేజిఎఫ్ 2 సినిమా నడుస్తోంది. ఆచార్య డైరెక్టర్ కొరటాల శివకు దిల్ రాజుతో ఎక్కడో గ్యాప్‌ ఉందని.. అందుకే కొరటాల పట్టుబట్టి మరీ ఈ సినిమా రైట్స్ వరంగల్ శ్రీనుకు ఇప్పించేలా చేశారన్న ప్రచారం అయితే గత కొంత కాలంగా ఉంది. అయితే ఇప్పుడు నైజాంలో సినిమా పంపిణీ వ్యాపారం అనేది దిల్ రాజు వర్సెస్ వరంగల్ శ్రీను మ‌ధ్య నడుస్తోంది. ఒకప్పుడు నైజాంలో సినిమా పంపిణీ వ్యాపారం అంతా కేవలం దిల్ రాజు కనుసన్నల్లోనే నడిచేది.

అయితే ఆచార్య సినిమా రైట్స్ వ‌రంగ‌ల్ శ్రీను రు. 42 కోట్ల‌కు కొన్నారు. నైజాంలో ఈ రేటు అంటే చాలా పెద్ద అమౌంట్‌. పైగా రాజు వ‌ర్సెస్ శ్రీను మ‌ధ్య పెద్ద యుద్ధ‌మే న‌డుస్తోంది. గ‌తంలో త‌న సినిమాలు క‌లెక్ష‌న్ల‌తో ఉండ‌గానే దిల్ రాజు తీయించేశార‌ని వ‌రంగ‌ల్ శ్రీను ఓపెన్‌గానే ఆరోప‌ణ‌లు చేశారు. దిల్ రాజును కిల్ రాజు అని కూడా విమ‌ర్శించారు. ఇక ఇప్పుడు ఆచార్య వ‌స్తోంది. ఆచార్య రైట్స్‌ను వ‌రంగ‌ల్ శ్రీను ఎప్పుడో యేడాది క్రిత‌మే కొన్నారు. అడ్వాన్స్ ఇచ్చారు.

ఇప్పుడు ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో థియేట‌ర్లు దొర‌క‌క‌పోయినా… మంచి థియేట‌ర్లు రాక‌పోయినా అంద‌రికి దెబ్బ ప‌డుతుంది. అంటే ఈ సినిమా కొన్న శ్రీనుతో పాటు సినిమా వ‌సూళ్ల‌పై ప్ర‌భావం చూపుతుంది. ఇదిలా ఉంటే కొర‌టాల డైరెక్ట్ చేసిన భ‌ర‌త్ అనే నేను సినిమాకు సంబంధించి నైజాంలో కొంత రిక‌వ‌రీ అయితే ఉందంటున్నారు. వాస్త‌వం ఏంటో తెలియ‌దు.. అప్పుడు ఈ సినిమా బిజినెస్ వ్య‌వ‌హారాలు చూసిన కొర‌టాల ఖాతాలో వేశార‌ట నిర్మాత దాన‌య్య‌.

 

ఇలా ఎక్క‌డో కొర‌టాల‌కు రాజుకు తేడా కొట్టింద‌ట‌. దీనికి తోడు రాజుకు పోటీగా ఉన్న డిస్ట్రిబ్యూట‌ర్ వ‌రంగ‌ల్ శ్రీనుతో వ్యాపార‌ప‌ర‌మైన గ్యాప్. ఇవ‌న్నీ ఆచార్య థియేట‌ర్ల‌పై ప్ర‌భావం చూపుతున్నాయంటున్నారు. అంతిమంగా ఈ విష‌యంలో ఎవ‌రికి ఎవ‌రిమీద కోపం ఉన్నా.. ఏ పోటీ ఉన్నా కూడా ఆచార్య బ‌లికాక త‌ప్పేలా లేదు. మ‌రి ఈ వివాదం రిలీజ్‌కు ముందు స‌మ‌సిపోతేనే ఆచార్య‌కు ఇబ్బంది ఉండ‌దు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news