Moviesబాల‌య్య సినిమాలో మ‌రో యంగ్ హీరో.. కేక పెట్టించే కాంబినేష‌న్‌...!

బాల‌య్య సినిమాలో మ‌రో యంగ్ హీరో.. కేక పెట్టించే కాంబినేష‌న్‌…!

ఇటు స‌క్సెస్ ఫుల్‌గా ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు బాల‌య్య‌. అఖండ త‌ర్వాత బాల‌య్య లైన‌ప్ అయితే మామూలుగా లేదు. ఇప్పుడు క్రాక్ డైరెక్ట‌ర్ మ‌లినేని గోపీచంద్ డైరెక్ష‌న్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా గురించి ఇండ‌స్ట్రీ ఇన్స‌ర్ స‌ర్కిల్స్‌లో అదిరిపోయే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా త‌ర్వాత అనిల్ రావిపూడి సినిమా ఉంది. అనిల్ రావిపూడి ప్ర‌స్తుతం ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు. ఇది వ‌చ్చే నెల‌లో రిలీజ్ ఉంది. ఆ త‌ర్వాత సెప్టెంబ‌ర్ నుంచి బాల‌య్య సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంద‌ని అనిల్ రావిపూడి చెప్పేశారు.

ఇక ఈ సినిమాలో బాల‌య్య‌తో పాటు మ‌రో యంగ్ హీరో కూడా న‌టిస్తార‌న్న ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ ఇంట్ర‌స్టింగ్ హీరో ఎవ‌రో కాదు సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌. తాజాగా డీజే టిల్లు సినిమాతో యూత్‌లో బాగా పాపుల‌ర్ అయ్యాడు సిద్ధు. బాగా సిద్ధుకు బాల‌య్య అంటే బాగా ఇష్టం. ఇక ఈ సినిమాలో ఇప్పుడు బాల‌య్య‌తో పాటు సిద్ధు కూడా న‌టించ‌బోతున్నాడ‌ట‌. సిద్ధు పాత్ర ఇంట‌ర్వెల్ బ్యాంగ్ టైంలో వ‌స్తుంద‌ట‌.

ఇక సెకండాఫ్‌లో సిద్ధు పాత్ర సినిమాలో కీల‌కం కాబోతుంద‌ని తెలుస్తోంది. సినిమా ఫ‌స్టాఫ్ అంతా సీరియ‌స్‌గా ఉంటుంద‌ని.. ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌తో ఫుల్ కామెడీకి ట‌ర్న్ అవుతుంద‌ని అంటున్నారు. ఆ త‌ర్వాత అనిల్ రావిపూడి త‌న‌దైన మార్క్ కామెడీ టైమింగ్‌తో పాటు యాక్ష‌న్‌తో సెకండాఫ్‌ను న‌డిపిస్తాడ‌ని అంటున్నారు.

అనిల్ రావిపూడికి ప‌టాస్ నుంచి మొద‌లు పెడితే స‌రిలేరు నీకెవ్వ‌రు వ‌ర‌కు తిరుగులేదు. వ‌చ్చే నెల‌లో ఎఫ్ 2 లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌కు సీక్వెల్‌గా ఎఫ్ 3 సినిమా వ‌దులుతున్నాడు. ఎఫ్ 3పై కూడా భారీ అంచ‌నాలే ఉన్నాయి. పైగా ఇద్ద‌రు క్రేజీ హీరోల‌నే ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాల్లో బ్యాలెన్స్ చేస్తూ వ‌చ్చాడు. ఇప్పుడు బాల‌య్య లాంటి సీనియ‌ర్ హీరో సినిమాలో కుర్ర హీరోను పెట్టి బ్యాలెన్స్ చేయ‌డం అనిల్‌కు మ‌రింత ఈజీ అవుతుంది.

గ‌తంలోనే బాల‌య్య – అనిల్ కాంబోలో రామారావు గారు టైటిల్‌తో సినిమా అనుకున్నా కుదర్లేదు. ఎట్ట‌కేల‌కు ఇప్పుడు ఈ కాంబినేష‌న్ సెట్ అయ్యింది. బాల‌య్య త్వ‌ర‌గా మ‌లినేని గోపీ సినిమాను ఫినిష్ చేసి ఆ వెంట‌నే అనిల్ సినిమాకు రెడీ అయిపోతారు. సెప్టెంబ‌ర్‌లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయితే ఐదారు నెల‌లు ప‌ట్టొచ్చు. అంటే వ‌చ్చే స‌మ్మ‌ర్‌కు ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news