బాలయ్య అఖండ గర్జన తర్వాత దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నటిస్తోన్న సినిమా షూటింగ్లో బిజీ ఉన్నాడు. బాలయ్య కెరీర్లో 107వ సినిమాగా తెరకెక్కే ఈ ప్రాజెక్టులో అందాల తార శృతీహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. కోలీవుడ్ క్రేజీ హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్ కూడా మరో కీలక పాత్రలో కనిపిస్తోంది. మైత్రీ మూవీస్ వాళ్లు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మలినేని గోపీ సినిమా తర్వాత బాలయ్య టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. గతంలో వచ్చిన ఎఫ్ 2 లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాకు కంటిన్యూగా వస్తోన్న ఎఫ్ 3 సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. పైగా ఈ సినిమా వచ్చిన రెండు రోజులకే చిరంజీవి – చెర్రీ నటించిన ఆచార్య కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో ఈ రెండు సినిమాల బాక్సాఫీస్ ఫైట్‌పై అందరూ ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు.
ఎఫ్ 3 రిలీజ్ అయిన వెంటనే అనిల్ రావిపూడి బాలయ్య సినిమా కోసం కథా కసరత్తులు చేస్తారు. ఈ ప్రాజెక్టు గురించి రోజుకో వార్త బయటకు వస్తోంది. తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమా గురించి ఓ అప్డేట్ ఇచ్చేశారు. బాలయ్య సినిమా మల్టీస్టారర్ అంటూ ఒక్కటే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో బాలయ్యతో పాటు కళ్యాణ్‌రామ్ నటిస్తారని ఓ సారి.. మాస్ మహరాజ్ రవితేజ నటిస్తారని మరోసారి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.
ఈ వార్తలకు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం తాను ఎఫ్ 3 మ్యూజిక్ సిట్టింగ్స్‌లో ఉన్నానని.. బాలయ్య సినిమా కోసం కథ ఇప్పటికే రెడీ అయ్యింది.. ఇది సింగిల్ హీరో సినిమా మాత్రమే… మల్టీస్టారర్ కాదని చెప్పేశారు. దీంతో బాలయ్య .. అనిల్ సినిమాలో సింహంలా సింగిల్ గానే రాబోతున్నాడని క్లారిటీ వస్తోంది.