ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత పదేళ్లలో ఎంత పెద్ద స్టార్ అయ్యాడో ఊహకే అందడం లేదు. రేసుగుర్రం సినిమాకు ముందు బన్నీది చాలా యావరేజ్ రేంజ్. ఆ సినిమా సంచలన విజయం.. బ్లాక్‌బస్టర్.. అప్పటికే మల్లూవుడ్‌లో బన్నీ ప్లాప్ సినిమాలకు సైతం మంచి మార్కెట్ ఉంది. రేసుగుర్రం ఏకంగా అక్కడ రు. 7-8 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. ఆ దెబ్బకు బన్నీ సినిమా వస్తుంది అంటే అక్కడ పెద్ద హీరోల సినిమాలు సైతం భయపడే పరిస్థితి వచ్చేసింది. ఆ తర్వాత బన్నీకి మిగిలిన భాషల్లో ఆ రేంజ్ మార్కెట్ లేదు. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాతో కన్నడ నాట పాగా వేసేశాడు.
ఇక ఇప్పుడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అసలు పుష్ప సినిమాను బాలీవుడ్‌లో రిలీజ్ చేయాలా ? వద్దా ? రిలీజ్ చేస్తే అక్కడ ప్రేక్షకులు చూస్తారా ? ఎందుకు అనవసరంగా రిస్క్ అని ముందు చాలా డౌట్ పడ్డారు. రాజమౌళి సైతం పుష్పను బాలీవుడ్‌లో రిలీజ్ చేయమని దర్శకుడు సుకుమార్‌కు రిక్వెస్ట్ చేశాడు. అసలు ప్రమోషన్లు కూడా పెద్దగా లేకుండానే పుష్ప హిందీ బెల్ట్‌లో ఏకంగా రు. 100 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇది మామూలు సంచలన విజయం కాదు.. అంతకు మించే అని చెప్పాలి.
అసలు హిందీ బెల్ట్‌లో పుష్ప అంత పెద్ద విజయం సాధిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఆ విజయంతోనే ఓవరాల్‌గా వరల్డ్ వైడ్గా ఈ సినిమాకు రు. 365 కోట్లు కొల్లగొట్టింది. అంటే మేకర్స్‌కు మామూలు లాభాలు రాలేదు. రు. 100 కోట్లు అదనంగా వీళ్లకు యాడ్ అయ్యాయి. అందుకే ఇప్పుడు పుష్ప పార్ట్ 2 విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏ మాత్రం హడావిడి లేకుండా కాస్త గ్యాప్ తీసుకుని అయినా ఈ సినిమాను అటు నార్త్ ప్రేక్షకులకు కూడా ఎక్కేలా కథలో చిన్న చిన్న మార్పులు కూడా చేస్తున్నారట.
మామూలుగా అయితే ఈ పాటికే పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ కావాల్సి ఉంది. ఇప్పుడు అంత హడావిడి పడడం లేదు. బన్నీ పాన్ ఇండియా ఇమేజ్ ఇలాగే కంటిన్యూ చేసే ప్లాన్ చేస్తున్నారు. బన్నీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అయితే ఇప్పుడు ఈ సినిమాకు బన్నీ తీసుకునే రెమ్యునరేషన్ ఇండస్ట్రీ వర్గాల్లో మామూలు హాట్ టాపిక్‌గా లేదు. ఈ సినిమాకు బన్నీ రెమ్యునరేషన్ తీసుకోవట్లేదు.
హిందీ మార్కెట్ వసూళ్లలో వచ్చే షేర్ మాత్రం తాను తీసుకోబోతున్నాడట. నిర్మాతలకు సేఫ్ ఎలాంటి ఇబ్బంది లేదు. టాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్, ఓవర్సీస్.. ఇతర నాన్ థియేట్రికల్ రైట్స్ అంతా వాళ్లకే.. ఒక్క హిందీ రైట్స్ మాత్రమే బన్నీ ఖాతాలో పడతాయి. పుష్ప పార్ట్ 1 లాగా హిట్ అయితే పార్ట్ 2కు కూడా ఎలా లేదన్నా రు. 100 కోట్లకు.. అంతకు మించి వచ్చినా రావచ్చు. అందుకే ఇప్పుడు బన్నీ రు. 100 కోట్ల హీరో అయిపోయాడంటూ టాలీవుడ్ వర్గాల్లో ఒక్కటే చర్చ నడుస్తోంది. బన్నీ పాన్ ఇండియాలోనే తిరుగులని రు. 100 కోట్ల హీరో అవ్వడం అంటే మామూలు క్రేజ్‌లో లేడనే చెప్పాలి.