టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో భారీ పాన్ ఇండియా సినిమా వస్తోంది. ఈ సినిమా ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. యువసుధా ఆర్ట్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాన్‌రామ్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తోన్న సినిమా కావడంతో పక్కా ప్లానింగ్‌తోనే అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి. ఆచార్య సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న కొరటాల ఆ సినిమా రిలీజ్ అయ్యాకే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారు.
ప్రీ ప్రొడక్షన్ పనుల విషయంలో కొరటాల & టీం ఎక్కడా రాజీపడడం లేదు. గతంలో ఎన్టీఆర్ – కొరటాల కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమాను మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా హీరోయిన్గా ఆలియా భట్ ఎంపికైందని గత 20 రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేయడంతో నార్త్‌లో సినిమాకు క్రేజ్ వచ్చేందుకే కొరటాల ఆలియాను ఒప్పించాడని ప్రచారం జరిగింది.
అయితే ఇప్పుడు ఆలియా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందనే అంటున్నారు. ఇప్పుడు ఈ సినిమాలోకి అతిలోక సుందరి దివంగత శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ ఎంటర్ కానుందని తెలుస్తోంది. అసలు ముందే ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీకపూర్ పేరు వినిపించింది. ఆ తర్వాత త్రిబుల్ ఆర్ సినిమాలో చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆలియాను తీసుకున్నారన్న టాక్ వచ్చేసింది.
ఇప్పుడు ఆలియా తప్పుకోవడంతో ఇప్పుడు జాన్వీని ఫిక్స్ చేసేశారనే తెలుస్తోంది. ఈ నెలలో ఆలియా పెళ్లి చేసుకోబోతోంది. ఈ కారణంతోనే ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుని ఉండవచ్చని అంటున్నారు. ఇక జాన్వీ తండ్రి బోనీకపూర్ అయితే కుమార్తెను టాలీవుడ్ ఎంట్రీ చేయించేందుకు కొద్ది రోజుల నుంచి ట్రై చేస్తూనే వస్తున్నాడు. అయితే స్టార్ హీరోల పక్కనే తన కుమార్తెను నటింపజేయాలన్నదే బోనీ టార్గెట్.
ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, మహేష్ లాంటి పక్కన జాన్వీ పేరు కొంతకాలంగా వినిపిస్తోంది. అయితే ఎన్టీఆర్తోనే ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందని చివరకు రాసిపెట్టి ఉందేమో..! గతంలో ఎన్టీఆర్ తాత సీనియర్ ఎన్టీఆర్, జాన్వీ అమ్మ శ్రీదేవి కలిసి వెండితెరపై ఎన్నో సూపర్ హిట్లలో నటించారు. ఇప్పుడు ఆ తర్వాత తరాల్లోనూ వారి వారసులు కలిసి నటిస్తే అంతకు మించిన ఆనందం ఏం ఉంటుంది.