మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న ఆచార్య ట్రైలర్ రిలీజ్ అయ్యి.. సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది. ఫస్ట్ 24 గంటల్లోనే ఏకంగా 20 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తితోనే ఉంది. ట్రైలర్ చూసిన వాళ్లంతా సినిమా ఖచ్చితంగా రికార్డులు క్రియేట్ చేస్తుందన్న ధీమాతో ఉన్నారు. మెగాస్టార్ రీ ఎంట్రీ ఇచ్చాక చేసిన రెండు సినిమాల్లో ఖైదీ నెంబర్ 150 హిట్ అయినా కూడా ఇది కోలీవుడ్ హిట్ మూవీ కత్తి సినిమాకు రీమేక్. డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ కావడంతో అనుకున్నంత పేరు రాలేదు.
ఇక సైరా నరసింహారెడ్డి మూవీ కూడా రు. 100 కోట్లకు పైగా షేర్ కొల్లగొట్టింది. అయితే ఓవర్ బడ్జెట్‌తో ఈ సినిమా లాభాల్లోకి రాలేదు. ఆచార్యతో భారీ హిట్ కొట్టి తానేంటో ఫ్రూవ్ చేసుకునేందుకు చిరుతో పాటు అటు కొరటాల కసితో ఉన్నారు. పైగా సినిమాలో చిరు తనయుడు రామ్‌చరణ్ సైతం సిద్ధా పాత్రలో కనిపిస్తుండడం సినిమాకు మరింత హైప్ తెస్తోంది.
ఇక ట్రైలర్ బయటకు రావడం.. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఆచార్య స్టోరీ ఇదేనంటూ ఓ లైన్ కూడా బయటకు లీక్ అయ్యింది. తనయుడు చెర్రీ పోషిస్తోన్న పాత్ర సిద్ధ మిషన్ ను ఆచార్యగా వచ్చిన చిరంజీవి పూర్తి చేయడం ప్రధాన కథగా తెలుస్తోంది. రామ్‌చరణ్ – చిరంజీవి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు మేజర్ హైలెట్‌గా నిలుస్తాయని అంటున్నారు.
చెర్రీ క్యారెక్టర్ సెకండాఫ్‌లో 30 నిమిషాల పాటు ఉంటుందని ఇప్పటి వరకు టాక్ బయటకు వచ్చింది. లేటెస్ట్ టాక్ ప్రకారం చెర్రీ క్యారెక్టర్ ఫస్టాఫ్‌లోనే ఉంటుందని.. చెర్రీ – చిరు మధ్య వచ్చే సీన్లు కూడా ఫస్టాఫ్‌లోనే ఉంటాయని అంటున్నారు. ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ బ్లాక్ ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తాయని అంటున్నారు.
సినిమా కథ ధర్మస్ధలిలో స్టార్ట్ అవుతుంది. సిద్ధా .. పూజా హెగ్డేతో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలోనే సిద్ధ ( చరన్)కు, సోనూసుద్‌కు గొడవలు స్టార్ట్ అవుతాయి. కొన్ని కారణాల వల్ల సిద్ధ ఊరు వదిలి వెళ్లిపోతాడు. అలా ఊరు వదిలి వెళ్లిన సిద్ధ చిరంజీవి లీడర్‌గా ఉన్న నక్సలైట్ల గ్రూపులో చేరతాడు. అక్కడ చిరంజీవికి గురించి.. తన ఊరు గురించి పరిస్థితి వివరిస్తాడు. అక్కడ సిద్ధ ప్రాణాలు కోల్పోతాడు.
ఈ క్రమంలోనే సిద్ధ ఊరులో సమస్యలు పరిష్కరించేందుకు ధర్మస్థలికి ఆచార్య ఎంట్రీ ఇస్తాడు. చివరకు అక్కడ విలన్ల భరతం ఎలా ? పట్టాడు అన్నదే ఈ సినిమా స్టోరీ అంటున్నారు. మరి లైన్ ఇదే ఉంటుందా ? లేదా కొరటాల ఎలా చూపిస్తాడు ? అన్నది తెలియాలంటే ఈ నెల 29 వరకు ఆగాల్సిందే..!