మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన తాజా సినిమా ఆచార్య. తనయుడు రామ్‌చరణ్‌తో కలిసి తొలిసారిగా చిరు నటించిన సినిమా కావడంతో ఆచార్యపై మామూలు అంచనాలు లేవు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రు. 151 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. అంటే ఓవరాల్‌గా రు. 450 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు ఈ సినిమాకు రావాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి.
నైజాంలోనే ఈ సినిమాను రు. 45 కోట్ల రేంజ్‌లో వరంగల్ శీను పంపిణీ చేస్తున్నారంటేనే ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు ఏ రేంజ్‌లో కొంటున్నారో తెలుస్తోంది. ఈ నెల 29న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. కొరటాల శివ డైరెక్షన్, ఇటు కాజల్, పూజా హెగ్డే, సోనూ సుద్ లాంటి భారీ కాస్టింగ్ ఉండడంతో పాటు టీజర్లు, ట్రైలర్లు, స్టిల్స్ ఈ సినిమాపై అంచనాలు ఎక్కడికో తీసుకుపోయాయి.
ఇక మరో పది రోజుల్లో థియేటర్లలోకి రాబోతోన్న ఆచార్య రన్ టైం లాక్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా టోటల్ రన్ టైం 166 నిమిషాలుగా లాక్ చేశారట. అంటే 2 గంటల 46 నిమిషాల పాటు ఈ సినిమా ఉంటుంది. మామూలుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి పెద్ద సినిమా రన్ టైం 160 నుంచి 180 నిమిషాల పాటు ఉంటోంది. ఆచార్య రన్ టైం కూడా అదే రేంజ్‌లో ఉంది.
కొరటాల గత హిట్ సినిమాలు శ్రీమంతుడు – జనతా గ్యారేజ్ – భరత్ అనే నేను సినిమాల రన్ టైం కూడా 170 నిమిషాలకు కాస్త అటూ ఇటూగానే ఉన్నాయి. మరి ఇప్పుడు కూడా ఆ స్థాయిలోనే ఆచార్య రన్ టైం కూడా లాక్ చేశారు. రన్ టైం కాస్త ఎక్కువుగా ఉన్నా.. చిరు, రామ్‌చరణ్ ఇద్దరు స్టార్ హీరోలు ఉండడం.. భారీ కాస్టింగ్ ఉండడంతో పాటు కొరటాల మెస్మరైజ్ ఎంత వరకు పని చేస్తుందన్నదే ఈ సినిమా రేంజ్‌ను డిసైడ్ చేయనున్నాయి.
కొణిదెల ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్ – మ్యాట్నీ ఎంటర్టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించే ఈ సినిమాకు మణిశర్మ స్వరాలు అందించారు. ధర్మస్థలి నేపథ్యం, నక్సలిజం నేపథ్యాన్ని మిక్స్ చేసి కొరటాల ఈ సినిమా తెరకెక్కించారు.