కొరటాల శివ స్టోరీ రైటర్ నుంచి డైరెక్టర్ అయిపోయాడు. కొరటాల శివ సినిమాల్లో ఫస్ట్ నుంచి భయంకరమైన ఎలివేషన్లు ఏం ఉండవు. ఓ బలమైన కథ ఉంటుంది. ఎలివేషన్లు లేకపోయినా ఆ కథ, ఆ కథ చుట్టూ ఉండే ఎమోషన్లు, క్యారెక్టర్లు, పాత్రల మధ్య సంఘర్షణ సినిమాను నిలబెడుతూ వచ్చింది. ఓ బోయపాటిలాగానో, రాజమౌళి లేదా హరీష్ శంకర్ కావచ్చు.. మలినేని గోపీచంద్ కావచ్చు వీళ్లు ఇచ్చే మాస్ ఎలివేషన్లు కొరటాల ఖచ్చితంగా ఇవ్వలేడు. అయితే కథనే బలంగా నమ్ముకుంటాడు… అక్కడ చేయాల్సిన కసరత్తులతో పాటు ఎమోషన్లు, మంచి మాటలు ఇస్తాడు ఇవే కొరటాల సినిమాలను ఇప్పటి వరకు సక్సెస్ చేసుకుంటూ వచ్చాయి.
ఇంకా చెప్పాలంటే జనతా గ్యారేజ్‌లో చాలా లోపాలు ఉన్నాయి. ఆ సినిమా హీరో ఎన్టీఆర్ కాకపోయి ఉంటే అప్పుడే కొరటాల దొరికిపోయి ఉండేవాడు. అయితే ఎన్టీఆర్ అమోఘమైన నటన కొరటాల దర్శకత్వ లోపాలను కూడా కప్పి పెట్టి సినిమాను బ్లాక్‌బస్టర్ చేసింది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక భరత్ అనే నేను సెకండాఫ్ కూడా అంతే.. ఒక టైంలో ఎటు పోయిందో తెలియదు. అయితే ఫస్టాఫ్ అద్భుతంగా ఉండడం.. మహేష్‌బాబు ముఖ్యమంత్రిగా న్యాయం చేయడం లాంటి అంశాలతో చాలా వరకు గట్టెక్కినా జనతా గ్యారేజ్ రేంజ్ సినిమా అయితే కాలేదు.
అయితే ఇప్పుడు భరత్ అనే నేను తర్వాత నాలుగేళ్ల గ్యాప్ రావడంతో ఎంతో మంచి సినిమా చేయవచ్చు. అయితే కొరటాలకు ఎలివేషన్లు చేతకావు. బలమైన కథ అతడు నమ్ముతాడు. ఆచార్యకు అక్కడే పప్పులో కాలేశాడు. కథ వీక్‌గా ఉంది. పైగా ఇద్దరు మెగాస్టార్ హీరోలు ఉన్నప్పుడు కథ పరంగా రాజీపడకూడదు. ఎంత గొప్ప సినిమా హిట్ అవ్వాలన్న స్టార్లు ఉంటే సరిపోదు. కథ బలంగా ఉండాలన్న ప్రాథమిక సూత్రం ఏ సినిమాకు.. ఎంత పెద్ద హీరో సినిమాకు అయినా వర్తిస్తుంది.
ఆచార్యలో అది వర్కవుట్ కాలేదు. స్క్రిఫ్ట్ విషయంలో ఏ మాత్రం వర్క్ చేయలేదు. అసలు పసలేదు. కొరటాల సినిమాలు చూస్తే డైరెక్టర్‌గా అతడి మెరుపుల కన్నా కథ, రచనలో బలం, దమ్ము చూపిస్తాడు. కొరటాల సన్నిహితుడే అయిన బోయపాటి కథ కంటే కూడా డైరెక్షన్, ఎలివేషన్లలో దమ్ము చూపిస్తాడు. అదో స్టైల్. మర తనకు ఎక్కడ బలం ఉందో అక్కడే కొరటాల ఫెయిల్ అయ్యాడు. ఇక తనకు పట్టులేని చోట చేతులు ఎత్తేశాడు. అఖండ కూడా కథా పరంగా మరీ చేసిన కసరత్తులు కనపడవు. అయితే దమ్మున్న డైరెక్షన్, ఎలివేషన్లు అతడి సొంతం.
ఇక ఆచార్యలో కొరటాల తనకు బలం అయిన కథనే గాలికి వదిలేశాడు. సోషల్ డ్రామా అంటూ నక్సలిజం, ఆధ్యాత్మికం మిక్స్ చేసి వీక్ స్క్రిఫ్ట్ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. కథ కావచ్చు.. స్క్రీన్ ప్లే, ఇటు మాటల విషయంలో కొరటాల వైఫ్యలం పూర్తిగా కనపడింది. ఇక దర్శకత్వం చాలా వీక్ గా ఉంది. ఆచార్యతో విలన్లకు గుణపాఠం చెప్పించడం ఏమోగాని కొరటాల కళ్లు తెరిచి మాటలు తగ్గించుకుని గుణపాఠం నేర్చుకుని ఎన్టీఆర్ సినిమాతో హిట్ కొట్టకపోతే రేసులో వెనక్కు పోయినట్టే..!