టాలీవుడ్ సినీ లవర్స్‌కు 30 ఇయర్స్ పృథ్వి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో ఉన్న పృథ్వి తనదైన టైమింగ్ కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తూనే ఉంటారు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన పృథ్వికి కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం సినిమాతో మాంచి లైఫ్ వచ్చింది. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు పృథ్వికి సరైన క్యారెక్టర్లు పడలేదు. ఆ తర్వాత గోపీచంద్ లౌక్యం సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు.
అయితే వ్యక్తిగతంగా మాత్రం పృథ్వి ఇబ్బందుల్లో ఉన్నాడు. గత ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వైసీపీ గెలుపు కోసం బాగా కష్టపడ్డాడు. ప్రచారం చేశారు. వైసీపీ గెలిచిన వెంటనే జగన్ పృథ్విని ప్రతిష్టాత్మకమైన టీటీడీ భక్తి ఛానెల్ చైర్మన్‌ను చేశారు. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆరు నెలలకే ఈ పదవిని పృథ్వి వదులుకోవాల్సి వచ్చింది.
ఇక గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటోన్న పృథ్వి.. అటు రాజకీయంగా సక్సెస్ కాలేక.. ఇటు వైసీపీకి కొమ్ము కాయడంతో సినిమా అవకాశాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. అటు జనసేన, తెలుగుదేశంకు వ్యతిరేకంగా పృథ్వి ప్రచారం చేశారు. మెగా కాంపౌండ్ పృథ్విని పక్కన పెట్టేసిందనే ఇండస్ట్రీ టాక్ ? అయితే ఈ విషయంపై ఆయన కూడా స్పందించారు. రాజకీయాల కారణంగానే తనకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయని.. తనకు గతంలోలా ఎవరూ పిలిచి అవకాశాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే చాలా రోజుల తర్వాత పృథ్వి మళ్లీ ముఖానికి మేకప్ వేసుకున్నాడు. బాలకృష్ణ – మలినేని గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న #NBK107 సినిమాలో పృథ్వీరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. బాలయ్యతో పాటు పృథ్వి తాజాగా షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఈ సినిమా షూటింగ్ ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. వాస్తవానికి గత ఎన్నికల్లో తెలుగుదేశంకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన పృథ్వి బాలయ్యను కూడా విమర్శించాడు.
అయితే బాలయ్య అవేమి పట్టించుకోలేదు. బాలయ్యే స్వయంగా పృథ్వికి ఈ ఛాన్స్ ఇవ్వాలని డైరెక్టర్ గోపీచంద్‌కు సూచించాడట. ఏదేమైనా బాలయ్యను తాను రాజకీయంగా విమర్శించినా.. ఆయన మాత్రం అవేమి పట్టించుకోకుండా… ఛాన్స్ ఇవ్వడంతో పృథ్వి సంతోషం వ్యక్తం చేయడంతో పాటు బాలయ్య మనస్తత్వం మంచిదంటూ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అలాగే తాను గతంలో విమర్శలు చేసిన ఇండస్ట్రీ పెద్దలను కలిసి క్షమాపణలు కోరతానని కూడా పృథ్వి తెలిపాడు.