Moviesన‌ట‌సింహం బాల‌కృష్ణ గురించి 15 ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు ఇవే...!

న‌ట‌సింహం బాల‌కృష్ణ గురించి 15 ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు ఇవే…!

దివంగ‌త న‌ట‌ర‌త్న ఎన్టీఆర్‌కు స‌రైన సినీ వార‌సుడు అనిపించుకున్నాడు న‌ట‌సింహం బాల‌కృష్ణ‌. అటు పౌరాణికం నుంచి సాంఘీకం, చారిత్ర‌కం ఇలా ఏదైనా కూడా ఆ పాత్ర‌లో న‌టిస్తాడు అన‌డం కంటే జీవించేస్తాడు బాల‌య్య‌. బాల‌య్య జీవితంలో కొన్ని ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు మ‌నం తెలుసుకుందాం.

1- 1960 జూన్ 10న బసవ తారకం- తారక రామారావు ఎనిమిదో సంతానంగా చెన్నైలో బాల‌కృష్ణ జ‌న్మించాడు. హైద‌రాబాద్‌లోని నిజాం కాలేజ్‌లో బాల‌య్య బిఏ చ‌దివారు. మాజీ ఎమ్మెల్యే క‌దిరి బాబురావు బాల‌య్య‌కు క్లాస్‌మేట్‌.


2 – నటుడిగా బాలయ్య తాతమ్మ కల సినిమాతో 14 ఏళ్ల వ‌య‌స్సులో వెండితెర‌కు ప‌రిచ‌యం అయ్యాడు.
3 – బాలకృష్ణ కేవలం 22ఏళ్లకే వసుంధరను పెళ్లి చేసుకున్నారు. 1982లో వీరి పెళ్లి జ‌ర‌గ‌గా.. బ్రాహ్మ‌ణి, తేజ‌స్విని అనే కుమార్తెల‌తో పాటు మోక్ష‌జ్ఞ అనే కుమారుడు సంతానంగా ఉన్నారు.

4- బాలకృష్ణ మొదటి సారి సోలో హీరోగా నటించిన సినిమా సాహసమే జీవితం. ఈ సినిమాకు భారతీ- వాసు దర్శకులుగా పనిచేశారు. 1984లో విడుదలైన ఈ మూవీ అనుకున్నంత స్థాయిలో ఆడలేదు.
5- కోదండరామిరెడ్డి – బాలయ్యది హిట్ కాంబినేషన్. నారి నారి నడుమ మురారి, బొబ్బిలి సింహం, భలే దొంగ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వీరి కాంబోలో వ‌చ్చాయి. వీరి కాంబోలో మొత్తం 13 సినిమాలు వ‌స్తే.. అందులో 9 సూప‌ర్ హిట్‌.


6- కోడి రామకృష్ణ దర్శకత్వంలో 7 సినిమాల్లో బాలకృష్ణ హీరోగా నటించారు. అందులో ఆరు చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి.

7 – లక్ష్మీ నరసింహ స్వామి భక్తుడు అయిన బాలకృష్ణకు సింహం కలిసొచ్చేలా టైటిల్ పెట్టడం సెంటిమెంట్ అయ్యింది. సింహం టైటిల్ వ‌చ్చేలా సింహం నవ్వింది – బొబ్బిలి సింహం – సమర సింహా రెడ్డి – నరసింహా నాయుడు – సీమ సింహం – లక్ష్మీ నరసింహా – సింహా – జై సింహా సినిమాల టైటిల్స్‌లో సింహా ఉంది.


8- బాల‌య్య‌కు పోలీస్ రోల్స్ కూడా బాగా క‌లిసి వ‌చ్చాయి. ఇప్పటి వరకు ఆయన ఏకంగా 12 చిత్రాలలో పోలీస్ గా కనిపించారు. ఇందులో రౌడీఇన్‌స్పెక్ట‌ర్‌, ల‌క్ష్మీ న‌ర‌సింహా సూప‌ర్ హిట్‌.
9 – 1987లో బాలకృష్ణ నటించిన 8 సినిమాలు రిలీజ్ అయ్యాయి. బాల‌య్య కెరీర్‌లో ఒకే యేడాది ఎక్కువ సినిమాలు రిలీజ్ అయ్యింది ఈ యేడాదే.

10- బాలకృష్ణ-విజయశాంతిలది సూపర్ హిట్ పెయిర్. వీరిద్ద‌రు ఉన్నారంటే మార్కెట్ షేక్ అయ్యేది. వీరు 17 సినిమాల్లో క‌లిసి న‌టించారు.
11 – తండ్రి ఎన్టీఆర్, అన్న హరికృష్ణతో పాటు శ్రీకృష్ణార్జున విజయం, పాండురంగడు సినిమాల్లో శ్రీ కృష్ణుడిగా న‌టించిన బాల‌య్య‌.. తండ్రి ఎన్టీఆర్ పోషించిన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, శ్రీకృష్ణదేవరాయలు,దుష్యంతుడు, హరిశ్చంద్రుడు వంటి పౌరాణిక, చారిత్ర‌క పాత్ర‌లు పోషించ‌డం కూడా అరుదైన రికార్డు.


12- బాల‌య్య ప్ర‌యోగాత్మ‌క సినిమాలు కూడా చేశాడు. ఆదిత్య 369 హాలీవుడ్ రేంజ్ వినోదం ప్రేక్ష‌కుల‌కు అందించింది. ఈ సినిమాకు సీక్వెల్ గా ఆదిత్య 999 చేసే ఆలోచనలో బాలయ్య ఉన్నారు.

13 – బాల‌య్య‌కు నరసింహానాయుడు – సింహా – లెజెండ్ సినిమాల‌కు మొత్తంగా 3 సార్లు నంది అవార్డు వ‌చ్చింది.


14- బాల‌య్య స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో న‌ర్త‌న‌శాల సినిమా షూటింగ్ ప్రారంభ‌మైన దివంగ‌త న‌టి సౌంద‌ర్య మ‌ర‌ణంతో ఆగిపోయింది.
15 – బాలయ్య నట వారసుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మోక్షు ఎంట్రీకి త్వ‌ర‌లోనే రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఇక బాల‌య్య – జూనియ‌ర్ ఎన్టీఆర్ క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేయాల‌ని నంద‌మూరి అభిమానులు ఎప్ప‌టి నుంచో వేడుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news