భారతదేశం అంతటా సౌత్ లేదు.. నార్త్ లేదు.. ఎక్కడ చూసినా త్రిబుల్ ఆర్ మానియా మొదలైపోయింది. ఇది ఓకే… ఈ సారి జక్కన్న గత సినిమాలకు లేనట్టుగా ప్రమోషన్లు చాలా కొత్తగా చేస్తున్నారు. సంక్రాంతికి ముందు నుంచే ప్రమోషన్లు హోరెత్తించిన తారక్ – చెర్రీ – జక్కన్న త్రయం ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో నార్త్ నుంచి సౌత్ వరకు ప్రమోషన్లను పరుగులు పెట్టిస్తున్నారు. రేపటి నుంచి ఐదారు రోజుల పాటు దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ప్రమోషన్లు చేయనున్నారు.
హైదరాబాద్ – దుబాయ్ – బెంగళూరు – బరోడా – ఢిల్లీ – అమృత్‌సర్ – జైపూర్ – కోల్‌కతా – వారణాసి లాంటి ప్రధాన నగరాల్లో ఈవెంట్లు చేస్తున్నారు. త్రిబుల్ ఆర్ త్రయం గ్యాప్ లేకుండా తిరగనున్నారు. ఈ ప్రమోషన్లను రాజమౌళి తనయుడు కార్తీకేయ పర్యవేక్షిస్తున్నాడు. ఇదిలా ఉంటే గతంలో కంటే భిన్నంగా ఈ సారి ఈ ముగ్గురు కలిసి సినిమా రిలీజ్ రోజు ఉదయం 5 గంటలకు ఫ్యాన్స్‌తో కలిపి బెనిఫిట్ షో చూసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రమోషన్లలో భాగంగా రాజమౌళి – తారక్ – చరణ్ కలిసి చేసిన ఫన్నీ ఈవెంట్‌లో ముగ్గురం కలిసి ఎక్కడ సినిమా చూడాలన్న డిస్కషన్ వచ్చింది. అప్పుడు చరణ్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో చూద్దామా ? అనడిగాడు. అయితే రాజమౌళి భ్రమరాంబలో మామూలుగా చూస్తామని చెప్పారు. ఇక చరణ్ తన సినిమాను తొలి రోజు ఫ్యాన్స్‌తో కలిసి చిరుత మాత్రమే చూశానని.. ఆ తర్వాత ఏ సినిమా కూడా చూడలేదని చెప్పడంతో రాజమౌళి షాక్ అయ్యాడు. తారక్ అయితే అసలు తన సినిమాను తొలి రోజు తాను చూడలేదని చెప్పాడు.
ఇక సాయి గారు కర్నూలులో ఫస్ట్ షో చూద్దామని అంటున్నారని రాజమౌళి చెప్పగా.. ఆ వెంటనే చెర్రీ ఉదయం 6 గంటల షో కర్నూలులో చూసి.. 10 గంటలకు హైదరాబాద్‌లో చూద్దామని అన్నాడు. దీంతో అసలు ఇది ఎలా ? సాధ్యం అవుతుందని రాజమౌళి అవాక్కయ్యాడు. మనకున్న సమాచారం ప్రకారం 25వ తేదీ ఉదయం 4-5 గంటల మధ్యలో భ్రమరాంబలో పడే షోకు ఈ ముగ్గురు హాజరవుతారని.. ఫ్యాన్స్ మధ్యలోనే వీరు సినిమా చూస్తారని తెలుస్తోంది.
ఇక సినిమా సెలబ్రిటీలు హీరోల సినిమాలు చూడాలంటే ఎక్కువుగా నిజాంపేట క్రాస్ రోడ్స్‌లో ఉన్న భ్రమరాంబ, మల్లిఖార్జున థియేటర్లలోనే ఉదయం బెనిఫిట్ షో చూస్తారు. అక్కడ ప్రేక్షకుల మధ్యలో సినిమా చూడడం వాళ్లకు కూడా బాగా నచ్చుతుంది. గత 15 ఏళ్ల క్రితం ఈ సంప్రదాయం ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని థియేటర్లలో ఉండేది. అయితే ఇప్పుడు ఇది కూకట్‌పల్లి, నిజాంపేట క్రాస్ రోడ్స్ థియేటర్లకు మారింది. ఇక మూసాపేట శ్రీరాములు థియేటర్లో కూడా అప్పుడప్పుడు ఫెయిడ్ ప్రీమియర్లు వేస్తున్నారు.