అతిలోక సుందరి శ్రీదేవి.. 1975 – 1995 ఈ రెండు దశాబ్దాల్లో ఆమె భారతదేశ వెండితెరను ఏలేసింది. ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుపతి మూలాలు ఉన్న శ్రీదేవి ముందుగా తమిళ్‌లో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసినా ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చి.. ఆమెను ప్రేక్షకులు ఆరాధించే స్థాయి మాత్రం తెలుగు సినిమాతోనే వచ్చింది. సౌత్ సినిమా ఇండస్ట్రీని మహారాణిలా ఏలేసిన శ్రీదేవి ఆ తర్వాత కె. రాఘవేంద్రరావు ప్రోత్సాహంతోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా ఆమె అందంతో పాటు నటనకు నార్త్ ఇండియన్స్ ఫిదా అయిపోయారు.
బాలీవుడ్‌లో అప్పటి తరం స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన శ్రీదేవి బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్‌ను వివాహం చేసుకుంది. అప్పటికే బోనీకపూర్‌కు పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నా కూడా అతడినే పట్టుబట్టి మరీ వివాహం చేసుకోవడం అప్పట్లో దేశవ్యాప్తంగా ఓ సంచలనం అయిపోయింది. సరే దీనికి ముందే అప్పట్లో నార్త్‌ను ఏలేసిన స్టార్ హీరో మిథున్ చక్రవర్తితో శ్రీదేవి పీకల్లోతు ప్రేమలో పడింది. వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.
ఒకానొక దశలో శ్రీదేవి.. మిథున్‌ను వదిలి ఉండలేనంతగా ప్రేమ మైకంలో మునిగిపోయింది. చివరకు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. మరి వీరి పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయ్యింది ? ఏం జరిగిందో తెలిస్తే చిత్ర విచిత్రంగానే ఉంటుంది. తెలుగులో వచ్చిన ఖైదీ రుద్రయ్య సినిమాను బాలీవుడ్‌లో సార్‌వర్త్ కీ అవాజ్ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాకు మన తెలుగు వారు అయిన విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ అధినేత త్రివిక్రమరావు నిర్మాత.
ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతున్నప్పుడు శ్రీదేవి తల్లి స్వయంగా మిథున్‌ను తమ అమ్మాయిని పెళ్లి చేసుకొమ్మని అడిగారట. అయితే శ్రీదేవి తల్లి మిథున్‌కు ఓ కండీషన్ కూడా పెట్టారట. నువ్వు యోగితా బాలి ( మిథున్ భార్య)కు విడాకులు ఇవ్వు.. మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పారట. అయితే అందుకు మిథున్ ఒప్పుకోలేదట. తాను యోగితా బాలిని పెళ్లి చేసుకున్నాకే తన దశ తిరిగిందన్నదే ఆయన నమ్మకం.
యోగితతో తనకు పెళ్లయ్యాకే వరుస సూపర్ హిట్లు రావడంతో పాటు ముగ్గురు పిల్లలు పుట్టడం తన లైఫ్ హ్యాపీగా ఉండడం జరగడంతో ఆమె అంటే ఎంతో ఇష్టంగా ఉండేవాడు. తాను శ్రీదేవిని రెండో భార్యగా చేసుకుంటానే గాని.. యోగితకు మాత్రం విడాకులు ఇవ్వనని ఖరాఖండీగా చెప్పేశాడట. దీంతో రెండో భార్యగా తన కూతురు ఉండడం ఇష్టపడని శ్రీదేవి తల్లి ఈ పెళ్లికి ఒప్పుకోలేదట. అలా శ్రీదేవి – మిథున్ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఆ టైంలో కాస్త నిరాశలో ఉన్న శ్రీదేవికి ఓదార్పు మాటలతో దగ్గరైన బోనీ ఆమెను పెళ్లి చేసుకున్నాడు.