రాధేశ్యామ్ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇదే మాట అంటున్నారు.. అసలీ ప్రభాస్‌కు ఏమైంది.. ఎందుకిలా ? చేస్తున్నాడు.. బాహుబలి తర్వాత వచ్చిన తిరుగులేని పాన్ ఇండియా ఇమేజ్‌ను కంటిన్యూ చేసే క్రమంలో లేనిపోని హడావిడి.. రాంగ్ స్టెప్పులు వేసుకుంటూ పోతున్నాడా ? సరైన ప్లానింగ్.. ఆలోచన లేదా ? ఇదే ఇప్పుడు సగటు ప్రభాస్ వీరాభిమాని నుంచి సినిమా అభిమానుల మదిని తొలచి వేస్తోంది.
అసలు బాహుబలి తర్వాత ప్రభాస్ అన్నీ పాన్ ఇండియా సినిమాలు చేయాలనుకుంటున్నాడు. అది తప్పులేదు. అయితే అందుకు తగిన కథలు, దర్శకలను ఎంచుకోవడం లేదు. ఎంతవరకు రు. 300 కోట్లు పెడితే అది పాన్ ఇండియా సినిమా అయిపోతుందన్న భ్రమల్లో ఉన్నట్టు కనిపిస్తోంది. కేవలం రన్ రాజా రన్ లాంటి ఒక్క సినిమాకు మాత్రమే దర్శకత్వం వహించిన సుజీత్‌ను నమ్మి సాహో తీశాడు.
సాహో భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. తెలుగులో అయితే ఈ సినిమాకు ప్లాప్ టాకే వచ్చింది. అయితే బాహుబలి క్రేజ్‌తో నార్త్‌లో ఈ సినిమా ఎలాగోలా గట్టెక్కేసింది. సాహోకు అక్కడ రు. 150 కోట్లు రావడంతో ప్రభాస్‌లో మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది. అయితే ఇక్కడే లెక్క తప్పింది. ప్రతిసారి బాహుబలి మానియా కాపాడలేదు. మళ్లీ రాధాకృష్ణ కుమార్ లాంటి ఒక్క సినిమా అనుభవం ఉన్న దర్శకుడిని గుడ్డిగా నమ్మేసి.. ఓ లవ్‌స్టోరీపై రు. 300 కోట్లు ఖర్చు పెట్టి రాధేశ్యామ్ సినిమా చేశాడు.
పైగా రాధాకృష్ణకు అప్పటి వరకు కేవలం రెండు సినిమాల అనుభవం మాత్రమే ఉంది. అలాంటి దర్శకుడిని ఎలా నమ్మేసి అంత ఖర్చు పెట్టించాడో తెలియదు. ప్రభాస్ తెలుగులో చేసిన ఫుల్ మాస్ సినిమాల్లో ఛత్రపతి, మిర్చి. ఇవీ మరీ కొత్త కథలు కాకపోయినా.. నటనకు స్కోప్ ఉన్న సినిమాలే. అసలు తెలుగులో ప్రభాస్ ఓకే చెప్పాలే కాని.. టాప్ డైరెక్టర్స్ మనోడితో సినిమాలు చేసేందుకు క్యూలో ఉంటారు.
ఒక వినాయక్ – పూరి జగన్నాథ్ – అనిల్ రావిపూడి – త్రివిక్రమ్ – కొరటాల శివ – బోయపాటి ఇలా ఎవరితో చేసినా మంచి మాస్ సినిమా వచ్చి ఉండేది. వీళ్లందరిని కాదనుకుని.. ఒకటి, అరా సినిమాల అనుభవం దర్శకుల వెంట పడుతున్నాడు.. వాళ్లకు ఎందుకు ? ఛాన్సులు ఇస్తున్నాడో ? అర్థం కావడం లేదు. ప్రయోగాలు చేయడంలో తప్పులేదు… పైగా 43 ఏళ్ల వయస్సులో రు. 300 కోట్లతో ప్రేమకథా ? అసలు ప్రభాస్ ఏం ఆలోచన చేస్తున్నాడో ? కూడా రాధేశ్యామ్ సినిమా చూశాక ఆయన అభిమానులకే అర్థం కావడం లేదు.
మరోవైపు ప్రభాస్ అభిమానులు మాత్రం ప్రభాస్ రేంజ్‌కు, ఆయన కటౌట్‌కు తగ్గ మాస్ హిట్ పడితే చూడాలని తహతహలాడిపోతున్నారు. బాహుబలి తర్వాత సాహో కోసం ఏకంగా మూడేళ్లు టైం వేస్ట్ చేశాడు. ఇప్పుడు సాహో తర్వాత మరో మూడేళ్లు కాలగర్భంలో కలిసిపోయాయి. ఇలా యేళ్లకు యేళ్లు వేస్ట్ అవ్వడం.. మనీ వేస్ట్ అయిపోవడం తప్పా ప్రభాస్‌కు కలిసొచ్చేదేం లేకుండా పోతోంది. కనీసం బాహుబలి తర్వాత సుకుమార్‌తో సినిమా చేసినా మంచి హిట్ పడేదని మనోడి అభిమానుల ఆవేదన.. మరి ప్రభాస్ ఇప్పటకీ అయినా నేలవిడిచి సాము చేయకుండా ఉంటాడేమో ? చూడాలి.