మెగాస్టార్ చిరంజీవికి భార్య అంటేనే ఎంత అదృష్టం.. ఎంతో హోదా.. ఎంత రాయల్టీగా ఉండొచ్చు. కానీ ఇవేవి ఆమెకు పట్టవు. పైగా కొడుకు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్.. ఈ తరం స్టార్ హీరో.. అటు భర్త నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీని తన కను సైగలతో శాసిస్తున్నారు. ఇక తండ్రి అల్లు రామలింగయ్య అంటే ఆ తరం జనరేషన్ అభిమానుల ఆరాధ్య నటుడు. ఇన్ని ఉన్నా కూడా కొణిదెల సురేఖమ్మ చాలా సింపుల్.. భర్త కొంగుచాటు భార్య.. హంగులు, ఆర్భాటాలు ఉండవు.
ఆమె పెద్దగా బయటకు రారు.. ఆమె పనేదో ఆమె చూసుకుంటారు. ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు.. పేదలను ఆదుకుంటారు.. ఇవేవి బయటకు రావు.. చెప్పుకునేందుకు కూడా ఆమె ఇష్టపడరు. ఇంకా చిరు అయినా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ సేవా కార్యక్రమాల ద్వారానో కరోనా టైంలో పేదలను ఆదుకున్నారనో వార్తల్లో ఉంటారే తప్పా సురేఖ చేసిన సేవలు అన్నీ తెరవెనకే ఉండిపోతాయి.
ఇది మాత్రమే కాదు.. ఆమెది ఎంత మంచి మనస్సో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సాక్షిగా భర్త చిరు బయట పెట్టారు. ఈ విషయంలో చిరు తన వందల కోట్ల విలువైన ఆస్తుల గురించి కూడా కొన్ని సంచలన విషయాలపై ఓపెన్ అయిపోయారు. ఇన్ని రోజుల తన కెరీర్ ఎదుగుదల వెనకాల సురేఖ ఎలా ఉందో చెప్పిన చిరు తన చెల్లెల్ల విషయంలో కూడా ఎంత ఉదార స్వభావంతో ఉంటుందో చెప్పారు. ఈ మాటలు వింటే సురేఖమ్మ మంచి మనస్సు ప్రతి ఒక్కరి హార్ట్ టచ్ చేస్తుంది.
హైదరాబాద్ సమీపంలోని కోకాపేటలో చిరుకు కొన్ని ఎకరాల్లో భూములు ఉన్నాయి. చాలా చవక రేటుల్లో వాటిని చిరు కొన్నారు. అయితే అక్కడ ఫామ్‌హౌస్ కట్టుకోవాలని చిరు అనుకున్నారు. ఇప్పుడు అక్కడ స్మార్ట్ సిటీ రావడంతో ఎకరం కోట్లలోకి వెళ్లిపోయింది. ఆ భూములన్నీ చిరుయే ఉంచుకోవచ్చు. అయితే సురేఖ మరోలా ఆలోచించారు అట. ఆమెకు బిడ్డలు ఉన్నారు. ఓ కొడుకు.. ఇద్దరు కూతుళ్లు.. కానీ ఆమె మాత్రం పట్టుబట్టి చిరుకు చెప్పింది.. చిరు చెల్లెళ్లు అయిన తన ఆడపడుచులకు కూడా వాటా ఇప్పించారట.
తన తమ్ముళ్లను తన కొడుకులకుగా ఎంతో గొప్పగా ఆదరించిన సురేఖమ్మ.. తన చెల్లెళ్లను కూడా అలాగే చూసుకుంటుందని చిరు గర్వంతో చెప్పారు. నిజానికి కోకాపేటలో ఎకరం భమి రేటు ఇప్పుడు కోట్లలోకి వెళ్లిపోయింది. అలాంటి విలువైన భూముల్లో కూడా ఆడపడుచులకు వాటా ఇప్పించడం అంటే ఎంతో మంచి మనస్సు ఉంటేనే సాధ్యమవుతుంది. ఇప్పటి రోజుల్లో ఈ విలువల గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. సెలబ్రిటీల బంధాలు ఎంత బలహీనంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయినా సురేఖమ్మ మాత్రం తన కుటుంబ బంధాలకు ఎంత విలువ ఇస్తారో చిరు స్వయంగా చెప్పి మురిసిపోయారు.