మెగా ఫ్యామిలీ హీరో మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ గత కొంతకాలంగా మంచి కంటెంట్ ఉన్న సినిమాలే చేసుకుంటూ వస్తున్నాడు. గద్దలకొండ గణేష్ లాంటి వైవిధ్యమైన సినిమా చేసి హిట్ కొట్టినా.. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌తో కలిసి ఎఫ్ 2 లాంటి మల్టీస్టారర్‌తో బ్లాక్‌బస్టర్ కొట్టినా.. ఇప్పుడు మరోసారి ఎఫ్ 3 చేస్తున్నా.. ఓవరాల్‌గా వరుణ్‌తేజ్ కథాబలం ఉన్న సినిమాలే ఎంచుకుంటున్నాడు.
సినిమా సినిమాకు వరుణ్‌తేజ్ క్రేజ్, రేంజ్ కూడా పెరుగుతోంది. ప్రస్తుతం వరుణ్‌తేజ్ రెమ్యునరేషన్ కూడా రు. 10 కోట్లకు పైనే ఉంది. తాజాగా వరుణ్‌తేజ్ నటించిన సినిమా గని. ఇంట్రస్టింగ్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయ్యింది. ట్రైలర్‌తోనే వరుణ్ దుమ్ము రేపేశాడు. 2.17 నిమిషాల పాటు ఉన్న ట్రైలర్లో ఆద్యంతం యాక్షన్ సీన్లతో పాటు అమ్మ సెంటిమెంట్ కూడా చూపించారు.
అల్లు అరవింద్ సమర్పణలో ఆయన తనయుడు అల్లు బాబి నిర్మిస్తోన్న ఈ సినిమా గీతా కాంపౌండ్‌లో వస్తుండడంతో ముందు నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే మేకర్స్ ఈ రోజు ట్రైలర్ కట్ చేశారని చెప్పాలి. వరుణ్ మాంచి ఫిజిక్‌తో పాటు కండలు తిరిగిన దేహంతో అంతకు మించి మాంచి ఎగ్రెసివ్ మోడ్‌లో ఉన్నాడు. ఓ వైపు బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌తో పాటు అటు హీరోయిన్ సాయి మంజ్రేకర్‌తో మాంచి లవ్ ట్రాక్ కూడా ఉందని ట్రైలర్లో చూపించారు.
అయితే ఇకపై బాక్సింగ్ ఆడవద్దని అమ్మకు చేతిలో చేయి వేసి మాట ఇస్తాడు. ఇటు తనకు ఎంతో ఇష్టమైన బాక్సింగ్ ఆడేందుకు అమ్మకు ఇచ్చిన మాట తప్పి .. ఆ తర్వాత ఏం చేశాడు ? ఈ ప్రయత్నంలో అతడికి ఎదురైన అడ్డంకులు ఏంటన్న కాన్సెఫ్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో కీలక పాత్రల్లో బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టితో పాటు అమ్మగా నదియా, కన్నడ నటుడు ఉపేంద్ర కూడా కనిపిస్తున్నారు.
ఇక ట్రైలర్లో బాక్సింగ్ సెటప్ అంతా రియలిస్టిక్‌గా కనిపిస్తోంది. డైలాగ్స్, థమన్ నేపథ్య సంగీతం అన్ని సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఓవరాల్‌గా గని సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ అని అర్థమవుతోంది. ఈ సినిమా పూర్తి రిజల్ట్ ఏంటనేది ఏప్రిల్ 8న తేలిపోనుంది.