ప్రభాస్ ఇప్పుడు ఆల్ ఇండియా స్టార్ హీరో.. రు. 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే రేంజ్. బాహుబలి రెండు సినిమాలు సాహో తర్వాత ప్రభాస్ ఏ సినిమా చేసినా అది పాన్ ఇండియా సినిమా అవుతోంది. రాధేశ్యామ్, ఆ తర్వాత సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే ఇలా ఏది చూసినా కూడా సంచలనాలతోనే వస్తోంది. ప్రభాస్ సినిమా అంటే బాలీవుడ్ వాళ్లు సైతం షాక్ అయ్యే రేంజ్‌లో ఉంటోంది.
అయితే ఇన్ని పెద్ద సినిమాలు, పెద్ద డైరెక్టర్ల మధ్యలో ప్రభాస్ అనూహ్యంగా మారుతి డైరెక్షన్‌లో ఓ సినిమాలో చేసేందుకు ఓకే చెప్పాడు. పైగా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. ఈ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాత. అసలు ప్రభాస్ ఈ సినిమాకు ఎందుకు ఓకే చెప్పాడు ? పైగా 50 రోజుల కాల్షీట్లు మాత్రమే ఇస్తానని ఎందుకు ? చెప్పాడు ? ఆ కథ ఏంటన్నదే ఇక్కడ ఇంట్రస్టింగ్. దీని వెనక ఓ స్టోరీ ఉందని తెలుస్తోంది.
త్రిబుల్ ఆర్ లాంటి సినిమాను రు. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మాత దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ఆయన పెట్టిన పెట్టుబడి.. మూడేళ్ల నుంచి వడ్డీలు కూడా కలుపుకుంటే చాలా ఖర్చయినట్టు లెక్క. ఆయన తన బ్యానర్లో ప్రభాస్ హీరోగా ఓ సినిమా తీయాలని.. ప్రభాస్‌ను ప్రశాంత్ నీల్ దగ్గరకు తీసుకు వెళ్లాడట. అయితే ప్రభాస్ – ప్రశాంత్ నీల్ సినిమా అయితే సెట్ అయ్యింది కాని.. అది దానయ్యకు కాదు.
అయితే అప్పుడు ఇచ్చిన మాట ప్రకారమే ఇప్పుడు దానయ్యకు ప్రభాస్ సినిమా చేస్తున్నాడట. ప్రభాస్ ఇచ్చిన మాట తప్పే వ్యక్తి కాదు. అప్పుడెప్పుడో బాహుబలి సినిమాకు ముందే రాధాకృష్ణ కుమార్‌కు సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారమే ఇప్పుడు రాధేశ్యామ్ సినిమా చేశాడు. ఇక దానయ్య – ప్రభాస్ – మారుతి సినిమా విషయానికి వస్తే కొద్ది రోజుల క్రితమే దానయ్య ప్రభాస్‌కు రు. 75 కోట్లు సింగిల్ పేమెంట్ చేశాడన్న గుసగుసలు ఇండస్ట్రీలో బయటకు వచ్చేశాయి.
అయితే ఈ డబ్బు అడ్వాన్స్‌గా ఇచ్చారా ? లేదా రెమ్యునరేషన్‌గానా అన్నది అయితే తెలియడం లేదు. రాధేశ్యామ్ రిలీజ్‌కు సాయం కావాలని ప్రభాస్ అడిగిన వెంటనే దానయ్య సింగిల్ పేమెంట్ ఇచ్చేశారనే అంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పక్కన నటించే ముగ్గురు హీరోయిన్ల కోసం ఇప్పుడు వేట స్టార్ట్ చేశాడు మారుతి. 50 రోజుల కాల్షీట్లకు రు. 75 కోట్లు అంటే.. రోజుకు కోటిన్నర అన్నమాట. దీనిని బట్టి ప్రభాస్ చాలా కాస్ట్ లీ హీరో అయిపోయాడనుకోవాలి.