RRR విడుదలకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఇప్పటి వరకు మూడున్నర సంవత్సరాలుగా ఈ సినిమా కోసం కొన్ని కోట్లాది మంది అభిమానులు వెయిట్ చేశారు. ఇక ఈ సినిమా థియేటర్లలోకి దిగేందుకు మరి కొద్ది గంటల టైం మాత్రమే ఉంది. ఈ కొద్ది గంటలు కూడా ఎలా ? గడుస్తాయా ? అని ప్రేక్షకులు అందరూ ఎంతో ఉత్కంఠతో ఉన్నారు. ప్రతి గంటను ఎప్పుడు ముగుస్తుందా ? అని చేతి వేళ్లతో లెక్క పెట్టుకుంటున్నారు.
ఇక ఈ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా ఫస్ట్ డే ఎప్పుడు చూద్దామా అని కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. ఈ షో ఫస్ట్ డే చూసేందుకు ఒక్కటంటే ఒక్క టిక్కెట్ ఉంటే చాలని ఎంతో కష్టపడుతున్నారు. చాలా మందికి టిక్కెట్లు దొరకక.. ఫస్ట్ డే సినిమా చూడలేమో అన్న బెంగతో కూడా ఉంటున్నారు. సాధారణ సినీ జనాలే కాదు.. సెలబ్రిటీలకే టిక్కెట్లు దొరకని పరిస్థితి.
సెలబ్రిటీలు, ఈ సినిమాకు పనిచేసిన వారే 100 టిక్కెట్లు కావాలని నిర్మాత దానయ్య, దర్శకుడు రాజమౌళికి పదే ఫోన్లు చేస్తుండడంతో వారే ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకోవడమో లేదా లిఫ్ట్ చేయకపోవడమో చేస్తున్నారట. బయట ఒక్క టిక్కెట్ కోసం.. అది కూడా షో ఒక్క సారి చూసేందుకు నానా తంటాలు పడుతుంటే ఓ వ్యక్తి మాత్రం ఈ సినిమాను ఇప్పటికే ఏకంగా 12 సార్లు చూసేశాడట. సినిమా అదిరిపోయిందని చెపుతూనే తనకు ఇంకా ఇంకా చూడాలని ఉందని చెపుతున్నాడు.
ఆ వ్యక్తి ఎవరో కాదు ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషీయన్. త్రిబుల్ ఆర్ సినిమాకు పనిచేసిన బృందం ఇప్పటికే చాలాసార్లు ఈ సినిమాను చూసేసింది. ఈ క్రమంలోనే RRR, VFX హెడ్ శ్రీనివాస మోహన్ కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా అదిరిపోతుందని ఓ ట్వీట్ చేశాడు. తాజాగా ఇప్పుడు సినిమా రిలీజ్‌కు ముందు మరోసారి ఆయన ఉత్కంఠగా ట్వీట్ వేశారు. అన్ని ఫార్మాట్లలో కలిపి ఈ సినిమాను ఇప్పటికే 12 సార్లు చూశానని.. ఇప్పుడు పెద్ద స్క్రీన్‌పై చూసేందుకు ఉత్సాహంతో ఎదురు చూస్తున్నానని చెప్పాడు.
ఇక తాను మరోసారి చూడడంతో పాటు ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు కూడా ఉత్కంఠతోనే వెయిటింగ్‌లో ఉన్నానని కూడా శ్రీనివాస మోహన్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఏదేమైనా త్రిబుల్ ఆర్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా ? అన్న ఉత్కంఠ సగటు సినీ అభిమానికి మాత్రమే కాకుండా ఆ సినిమాకు పనిచేసిన వారందరికి కూడా ఉంది.
@RRRMovie RRRepeat mode on. Watched 12 times on the big screen in every format, excitement is increasing with each viewing. Can’t wait to see the audience reaction. 12 hours to go. #RRRFromTomorrow pic.twitter.com/oaNLC1MFDN
— Srinivas Mohan (@srinivas_mohan) March 24, 2022