ప్రభాస్ 2013 నుంచి ఈ 9 ఏళ్లలో చేసినవి నాలుగైదు సినిమాలు మాత్రమే. 2013లో మిర్చి, 2015లో బాహుబలి 1, 2017లో బాహుబలి 2, 2019లో సాహో.. అంటే రెండేళ్లకు గాని ఒక సినిమా రావడం లేదు. ఇక సాహో తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకుని ఇప్పుడు రాధేశ్యామ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరో మరీ రెండేళ్లకు ఓ సినిమా చేయడం అంటే ప్రేక్షకులను నిజంగా డిజప్పాయింట్ చేయడమే అవుతుంది. అయితే ప్రభాస్ చేస్తోన్నవి అన్నీ లార్జన్ దెన్ సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు కావడంతో ఇవేవి ఓ పట్టాన త్వరగా తెమలడం లేదు.
అయితే ఇలా చేయడంతో ప్రభాస్ విసిగిపోయినట్టు ఉన్నాడు. ఇకపై చకచకా సినిమాలు చేసి తన ఫ్యాన్స్‌ను సంతృప్తి పరుస్తానని చెప్పేశాడు. ఈ నెల 11న రాధేశ్యామ్ వస్తోంది. మరో మూడు నెలల్లోనే మరో సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ యేడాది చివర్లో మరో సినిమా ఉంటుందని కూడా ప్రభాస్ చెపుతున్నాడు. ఇక వచ్చే సంక్రాంతికి ఎలాగూ ఆదిపురుష్ సినిమా ఉంది. ఓవరాల్‌గా చూస్తే వచ్చే 10 నెలల్లో నాలుగు సినిమాలతో ప్రభాస్ మన ముందుకు రాబోతున్నాడు. ఫ్యాన్స్‌కు ఇంతకు మించి పెద్ద పండగ ఏం ఉంటుంది.
ప్రస్తుతం రాధేశ్యామ్ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌లో బిజీబిజీగా ఉన్నాడు. ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేందుకు మరో నాలుగు రోజుల టైం మాత్రమే మిగిలి ఉంది. ఇక ఇప్పటికే ఆదిపురుష్ అయిపోయింది. ప్రాజెక్ట్ కె వర్క్ కూడా చాలా వరకు చేసేశాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సలార్ ఉంది. స్పిరిట్ లైన్లోనే ఉంది. కుదిరితే ఈ లోగానే మారుతి సినిమా అయిపోవచ్చు. ఇలా ప్రభాస్ సినిమాలు ఇక వెంట వెంటనే రిలీజ్ కానున్నాయి.
కోవిడ్ వల్ల యేడాదికి రెండు సినిమాలు చేస్తానన్న మాట నెరవేర్చుకోలేకపోయానని.. ఇక త్వరలోనే తాను జపాన్ వెళ్లి అక్కడ తన ఫ్యాన్స్‌ను కలుస్తానని చెప్పాడు. జపాన్ వెళ్లి అక్కడ ఫ్యాన్స్‌ను కలవాలన్న విషయాన్ని రాజమౌళీయే చెప్పారని.. ఇక తన ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే మంచి ఫుడ్ పెట్టడం అనేది తన ఫ్యామిలీ నుంచే తనకు వచ్చిందని ప్రభాస్ చెప్పాడు.