అబ్బబ్బా అందానికి కావాల్సినంత అందం.. కావాల్సినంత ప్రతిభ… చక్కటి చొరవ.. యూత్‌ను పిచ్చెక్కించే డ్రెస్సులు, బికినీలు ఇవన్నీ పూజా హెగ్డే సొంతం. దశాబ్దం క్రిందట ఆమె సౌత్‌లో జీవా పక్కన మాస్క్ సినిమా చేసినప్పుడు ఇదేం హీరోయిన్ అని ఎవ్వరూ పట్టించుకోలేదు. కట్ చేస్తే ఇప్పుడు ఆమె అడిగినన్ని కోట్లు ఇచ్చి టాప్ హీరోలు అందరూ ఆమే తమ సినిమాల్లో హీరోయిన్ కావాలని మరీ వెంటపడుతున్నారు. పూజా అయితే ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు అటు బాలీవుడ్‌ను ఏలేస్తోంది.
ఒక్కో సినిమాకు ఒకప్పుడు రు. 30 లక్షలు రావడమే ఆమెకు ఎక్కువ. అలాంటిది ఇప్పుడు రు. 3 – 4 కోట్లు డిమాండ్ చేసి మరీ తీసుకుంటోంది. ఆమె అడిగినంత ఇవ్వాలని నిర్మాతలు అనుకున్నా కూడా ఆమె డేట్లు దొరకడం లేదు. ప్రస్తుతం పూజాకు పోటీగా కియారా అద్వానీ, రష్మిక, కృతిశెట్టి ఇలా చాలా మంది హీరోయిన్లు పోటీలో ఉన్నా కూడా పూజ డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు.
ఇక పూజా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన అందచందాలతో కుర్రకారు మతులు పోగొడుతూనే ఉంటుంది. పూజ ఒంటికి అతుక్కుపోయే డ్రెస్సులతో పిచ్చెక్కించేస్తూ ఉంటుంది. పూజ బీచ్ పక్కన బికినీ వేసినా.. టైట్ దుస్తులు వేసుకున్నా.. పల్చటి పొరలాంటి డ్రెస్ వేసినా ఆమెను పదే పదే ఆ డ్రెస్సులో చూడాలని పిస్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో పూజా స్టిల్స్, లుక్స్‌కు వచ్చే కామెంట్లు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు.
తాజాగా ఆమె బాడీ హగ్ జిమ్ దుస్తులు వేసుకుంది. ఈ దుస్తుల్లో పూజా ఒంపుసొంపులు మామూలుగా లేవు. పింక్ కలర్ జిమ్ దుస్తుల్లో పూజా కిర్రాక్ ఎత్తించేస్తోంది. పూజ ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటంటే ఆమె ప్రతి రోజు గంటల తరబడి జిమ్‌లో గడుపుతూ ఉంటుంది. ఆమె ఫిట్‌నెస్ కాపాడుకునేందుకు ప్రతి రోజూ లీటర్ల కొద్ది నీటిని తాగుతుందట. సినిమా షూటింగుల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా డైట్ మెయింటైన్ చేయడంతో పాటు జిమ్ చేయాల్సిందే అట.
ఈ సీక్రెట్టే ఆమె అందాన్ని వయస్సు పెరుగుతున్నా ఏ మాత్రం చెక్కు చెదరనీయడం లేదు. ఇక పూజా నటించిన రాధే శ్యామ్ ఈ నెల 11న విడుదల కానుంది. ఇక కోలీవుడ్‌లో విజయ్ పక్కన బీస్ట్ సినిమాతో పాటు బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది.