ఎస్.ఎస్.రాజమౌళి భారతదేశం మొత్తం సలాం చేస్తోన్న తెలుగు దర్శకధీరుడు. 20 ఏళ్ల చరిత్రలో అస్సలు ఒక్క పరాజయం అన్నది కూడా లేకుండా దూసుకుపోతోన్న ఈ దర్శకధీరుడి సత్తాకు ఇప్పుడు యావత్ భారతదేశం మొత్తం గులాం చేస్తోంది. ఇంకా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ లవర్స్ మాత్రమే కాకుండా ఎంతో మంది ఆయన తాజా సినిమా త్రిబుల్ ఆర్ కోసం ఎగ్జైట్మెంట్‌తో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ షో పడేందుకు కొద్ది గంటలే ఉన్నాయి. ప్రతి గంటను ఈ సినిమా అభిమానులు ఓ యుగంగా ఫీల్ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు ఫస్ట్ షో వేసేస్తారా ? ఎప్పుడు చూసేద్దామా ? అన్నంత ఉత్కంఠతో ఉన్నారు.
ఇక రాజమౌళి సినిమాలకు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వర్క్ చేస్తారు. అన్న కీరవాణి ఎలాగూ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉంటారు. భార్య రమా కాస్ట్యూమ్స్.. ఇతర విషయాల్లో బిజీ..ఇక వదిన శ్రీవల్లి (కీరవాణి భార్య) లైన్ ప్రొడ్యుసర్‌గా ఉన్నారు. కొడుకు కార్తీకేయ సర్వం తానై ఉంటాడు. ఇక నాన్న విజయేంద్ర ప్రసాద్ ఎలాగూ స్టోరీ రైటర్. ఇక సినిమా కోసం వీళ్లతో పాటు వాళ్ల ఫ్యామిలీలోని ఇతర మెంబర్స్ అందరూ కూడా ప్రాణం పణంగా పెట్టి కష్టపడతారు అంటే నమ్మాల్సిందే. ఇదంతా ఇలా ఉంటే రాజమౌళి అంటేనే ఫస్ట్ నుంచి ఎంతో ఇన్నోసెంట్. గురువు కె. రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేసిన శాంతినివాసం సీరియల్‌ను డైరెక్ట్ చేసే టైంలోనే రమాతో ప్రేమలో పడ్డాడు.
ఎంతో సైలెంట్‌గా ఉంటే రమా పట్ల రాజమౌళి ఎలా ? ఆకర్షితుడు అయ్యాడు ? అసలు వారి ప్రేమ ఎలా ? ఎక్కడ పుట్టింది ? ఆ కథ ఏంటో చూద్దాం. ఇక రమ ఎవరో కాదు రాజమౌళి పెదనాన్న కుమారుడు అన్న అయిన సంగీత దర్శకుడు కీరవాణి భార్య వల్లికి సొంత అక్క. అయితే ఆమెకు ముందుగా ఓ పెళ్లి అయ్యింది. కార్తీకేయ కొడుకు కూడా పుట్టాడు. తర్వాత ఏవో మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అయితే రమ అప్పుడప్పుడు తన చెల్లి శ్రీ వల్లి ఇంటికి వస్తూ పోతూ ఉండేది. అక్కడ రాజమౌళితో పరిచయం.. అలా ప్రేమగా మారింది. ముందు రాజమౌళీయే ఇష్టపడ్డాడు.
నిజానికి రమను రాజమౌళి ఇష్టపడడం గొప్ప విషయమే. అప్పుడే మనోడు దర్శకుడిగా బుడిబుడి అడుగులు వేస్తున్నాడు. రమాకు అప్పటికే పెళ్లయ్యి కార్తీకేయ పుట్టడంతో పాటు విడాకులు కూడా అయిపోయాయి. నిజంగా ఈ విషయంలో రాజమౌళి ఆదర్శవంతుడే. కొన్ని విషయాల్లో ఇద్దరూ అర్థం చేసుకున్నారు. ముందు మనోడే ప్రపోజ్ చేశాడు. రమా ఓకే అంది. చివరకు పెద్దలకు చెప్పి సింపుల్‌గా నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు.
ఆ తర్వాత ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నారు ఆమె ఎవరో కాదు ఎస్.ఎస్. మయూఖ. ఇక రాజమౌళి సినిమాల విషయంలో ఆ ఫ్యామిలీ మెంబర్స్ సహకారంతో పాటు రమా తోడ్పాటు ఎంతో ఉంది. ఇక రాజమౌళి, రమ ఒకే యేడాదిలో పుట్టారు.. 1973లోనే వీరిద్దరు పుట్టారు. ఇక కార్తీకేయ మన స్టార్ హీరో జగపతిబాబు అన్న కుమార్తెనే ప్రేమించాడు. ఈ లెక్కన జగపతిబాబు – రాజమౌళి వియ్యంకులు అవుతారు. ఇక రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యే త్రిబుల్ ఆర్‌తో రాజమౌళి మరింత ఉన్నత శిఖరాలను టచ్ చేయాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం.