సినిమా రంగంలో ఓ హీరో చేయాల్సిన సినిమాలు ఒక్కోసారి అనుకోని కారణాలతో వేరే హీరో చేయాల్సి వస్తుంది. అలా చేతులు మారిన సినిమాలు హిట్ అయితే ఆ సినిమాను వదులుకున్న హీరోలు ఫీల్ అవుతూ ఉంటారు. అదే ప్లాప్ అయితే.. తమ జడ్జ్‌మెంట్ కరెక్ట్ అయ్యిందని.. తాము ప్లాప్ తప్పించుకున్నామని ఆనంద పడుతూ ఉంటారు. విచిత్రం ఏంటంటే నందమూరి నటసింహం బాలకృష్ణ, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్‌లు వేర్వేరుగా ఉంటాయి.
వీరిద్దరు సినిమాలు చేస్తే ఒకే తరహా కథలు సెట్ అవ్వవు. అయితే బాలకృష్ణ రిజెక్ట్ చేసిన కొన్ని కథలను పవన్ కళ్యాణ్ ఓకే చేసి నటించాడు. పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన సినిమా అయ్యప్పనుం కోషియమ్. తెలుగులో దగ్గుబాటి రానా మరో హీరోగా సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భీమ్లానాయక్‌గా వచ్చింది. ఫిబ్రవరి 25న రిలీజ్ అయిన భీమ్లా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది.
ఈ కథ ముందుగా బాలయ్య దగ్గరకే వచ్చింది. మరో యంగ్ హీరోను కూడా పెట్టుకుని బాలయ్యతోనే ఈ సినిమా చేయాలని అనుకున్నారు. బాలయ్య ఎందుకో ఆసక్తి చూపలేదు. చివరకు పవన్ దగ్గరకు వెళ్లడంతో ఆయన ఓకే చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ నటించిన అన్నవరం సినిమా కథ కూడా ముందు బాలయ్య దగ్గరకే వచ్చింది. ఈ కథకు బాలయ్య మాత్రమే సూట్ అవుతాడని భావించిన దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు బాలయ్యకే కథ చెప్పారట.
ఇది కూడా రీమేక్ 2007లో వచ్చింది. ఆశిన్ హీరోయిన్. ఈ సినిమా పవన్ ఇమేజ్‌కు సూట్ కాకపోవడంతో పెద్దగా మెప్పించలేకపోయింది. అలాగే మరికొన్ని కథలు కూడా ముందుగా బాలయ్య కోసం అనుకుని.. ఆయన చేయకపోవడంతో వేరే హీరోలు చేశారు. వెంకటేష్ హీరోగా పి. వాసు దర్శకత్వంలో వచ్చింది నాగవల్లి. ఈ సినిమాను ముందుగా బాలయ్యతో చేయాలని దర్శకుడు వాసు అనుకున్నారు. బాలయ్య వద్దని చెప్పడంతో వెంకటేష్ చేశారు. అయితే ఈ సినిమా ప్లాప్ అయ్యింది.
ఇక రాజశేఖర్ హీరోగా వచ్చి హిట్ అయ్యింది సింహరాశి. తమిళంలో శరత్‌కుమార్ హీరోగా వచ్చి హిట్ అయ్యింది మయి సినిమా. దీనిని తెలుగులో రీమేక్ చేయాలనుకున్నప్పుడు దర్శకుడు సముద్ర ముందుగా బాలయ్యనే హీరోగా అనుకున్నారు. బాలయ్యకు సింహా అన్న పదం కలిసి కూడా వస్తుందని అనుకున్నారు. బాలయ్య ఒప్పుకోకపోవడంతో చివరకు రాజశేఖర్ హీరోగా వచ్చి ఆయన కెరీర్‌లోనే పెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది.