సహజంగా ఏ సినిమాకు అయినా చాలా విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. ఓ దర్శకుడు లేదా కథా రచయిత ముందుగా కథ రాసుకునే టప్పుడు ఓ హీరోను దృష్టిలో పెట్టుకుని కథ రాస్తారు. ఆ తర్వాత ఆ కథలోకి ఆ హీరో కాకుండా మరో హీరో ఎంట్రీ ఇచ్చి.. అతడే ఆ సినిమాను చేస్తాడు. ఇలా చాలా సార్లు చాలా సినిమాలకు జరుగుతూనే ఉంటాయి. ఆ సినిమాకు ముందు అనుకున్న హీరో కొన్ని కారణాల వల్ల సెట్ కాకపోతే అప్పుడు మరో హీరోతో ఆ సినిమాను తీస్తారు.
అలాగే ఇప్పుడు RRR సినిమా కూడా ఎన్టీఆర్ – రామ్‌చరన్‌ను దృష్టిలో పెట్టుకుని రాసిన కథ కాదట. ఈ విషయాన్ని ఈ సినిమా స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ స్వయంగా చెప్పారు. అసలు ముందు ఈ కథను రాయాలని అనుకున్నప్పుడు ఏ హీరోను కాకుండా.. మామూలుగా స్టోరీ రాయాలని అనుకున్నారట. ముందుగా రజనీకాంత్ – అర్జున్, ఆ తర్వాత సూర్య – కార్తీ ఇలా ఈ రెండు జంటలతో సినిమా తీస్తే ఎలా ? ఉంటుందని ప్లాన్ చేసుకున్నారట.
అయితే చివరకు అటూ ఇటూ తిరిగి ఎన్టీఆర్ – చరణ్ దగ్గర ఆగామని విజయేంద్ర చెప్పారు. ఇక చరన్ – ఎన్టీఆర్‌లను ఈ సినిమాకు హీరోలుగా ఎంచుకోవడానికి కారణం.. నిజజీవితంలో స్నేహితులు అయితే ఈ రెండు పాత్రలు మరింత బాగా పండుతాయనే వీళ్లను ఎంచుకున్నట్టు ఆయన చెప్పారు. బాహుబలి సినిమాలో బాహుబలి – శివగామి రెండు పాత్రలు మంచివే అని.. ఒకానొక సందర్భంలో ఈ రెండు పాత్రల మధ్య పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతుందని.. అయితే ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమాలో సినిమా అంతా ఈ రెండు పాత్రల మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతూనే ఉంటుందని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.
ఇక సినిమాలో హీరోలు, విలన్లు అని కాకుండా.. ఓవరాల్‌గా కథను బట్టి, పాత్రలను బట్టి, సిద్ధాంతాలను బట్టి కథ ట్రావెల్ అవుతుందని ఆయన చెప్పారు. ఇక ఎన్టీఆర్‌కు జోడీగా బ్రిటీష్ ఓవీలియా మోరిస్, చరణ్‌కు జోడీగా అలియాభట్ నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్‌దేవగన్, శ్రియా చరణ్, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో నటించారు.