నటసింహం బాలకృష్ణకు కొన్ని ఏరియాలు కొట్టినపిండి.. ఆయన సినిమాలకు కంచుకోటలుగా ఉంటూ వస్తున్నాయి. సీడెడ్‌లో బాలయ్య ప్లాప్ సినిమాలు, యావరేజ్ సినిమాలు కూడా దుమ్ము రేపే వసూళ్లు రాబడతాయి. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, చెన్నకేశవరెడ్డి, లెజెండ్, సింహా, తాజాగా అఖండ ఇలా ఏ సినిమా చూసుకున్నా సీడెడ్‌లో వసూళ్ల పరంగా వీరంగం ఆడాల్సిందే. సీడెడ్‌లో కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో పలు సెంటర్లలో బాలయ్య సినిమాలు సెంచరీలు కొట్టడం మాత్రమే కాదు.. సంవత్సరాలు కూడా ఆడతాయి.
ఇక ప్రకాశం జిల్లాలోనూ బాలయ్య కొన్ని ప్రాంతాల్లో వీరాభిమానులు ఉన్నారు. నెల్లూరుకు ఆనుకుని ఉండే కందుకూరు సిటీ బాలయ్య సినిమాలకు కంచుకోట. ఎన్ని ఇండస్ట్రీ సినిమాలు వచ్చినా, ఎందరు హీరోల సినిమాలు ఎన్ని రికార్డులు తిరగరాసిని కూడా కందుకూరులో ఫస్ట్ డే షేర్ బాలయ్య పేరిటే ఉంది. తాజాగా బాలయ్య నటించిన అఖండ సినిమాకు కందుకూరులో ఫస్ట్ డే రు 6.5 లక్షల షేర్ వచ్చింది. ఈ సిటీలో ఇన్నేళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఇంత షేర్ ఎప్పుడూ , ఏ హీరోకూ రాలేదు.
అఖండ తర్వాత ప్లేస్‌లో ఎన్టీఆర్ అరవింద సమేత వీరరాఘవ సినిమా 5.9 లక్షలతో రెండో స్థానంలో ఉంది.. ఆ తర్వాత వరుసగా బాహుబలి 1 5.6 లక్షలు – బాహుబలి 2 .. 5.5 లక్షలు – జై లవకుశ 5.4 లక్షలు – జనతా గ్యారేజ్ 5.3 లక్షలు – పుష్ప 4.8 లక్షలు – గౌతమీపుత్ర శాతకర్ణి 4.7 లక్షలు – అల వైకుంఠపురములో 4.7 లక్షలు – సరిలేరు నీకెవ్వరు 4.5 లక్షలు వసూలు చేసి.. టాప్ – 10లో ఉన్నాయి.
ఓవరాల్‌గా చూస్తే కందుకూరు సిటీలో అఖండ ఫస్ట్ ప్లేసులో ఉంది. విచిత్రం ఏంటంటే బాలయ్య ఇండస్ట్రీ హిట్లుకు కూడా ఇంత షేర్ రాలేదు. అయితే బాలయ్య వందో సినిమా శాతకర్ణి మాత్రం 4.7 లక్షల షేర్‌తో 8వ స్థానంలో ఉంది. ఇక బాహుబలి లాంటి తెలుగు సినిమా చరిత్ర తిరగరాసిని సినిమాలకే ఫస్ట్ డే రాని షేర్ అఖండకు వచ్చింది. పైగా అది కూడా టిక్కెట్ రేట్లు తక్కువుగా ఉన్న టైంలో ఈ షేర్ రావడం అంటే కందుకూరు గడ్డ బాలయ్య అడ్డా అని అనాల్సిందేనేమో..!