మాలాశ్రీ ఈ పేరు వినగానే మనకు బావబావమరిది సినిమాలోని గజ్జెఘల్లుమన్నదో.. గుండె ఘల్లుమన్నదో అనే సాంగ్ గుర్తుకు వస్తుంది. సుమన్ – మాలాశ్రీ చేసిన సాంగ్. అప్పట్లో ఈ సాంగ్ బాగా పాపులర్. భలే ట్యూన్.. ఇది ఇప్పటకీ వినాలనిపించే సాంగ్. యూట్యూబ్‌లో ఈ సాంగ్‌కు ఏకంగా కోటిన్నరకు పైగా వ్యూస్ ఉంటాయి. ఇక మాలాశ్రీ ఒకప్పుడు కన్నడ ప్రేక్షకుల కలల మహారాణి. ఇక తెలుగులో మాలాశ్రీ – సుమన్‌ది మంచి ఫెయిర్. అప్పట్లో వీరిద్దరి గురించి చాలా వార్తలే వినపడేవి.
ఆమె పేరు వినగానే ముందుగా గుర్తొచ్చే సినిమా ప్రేమఖైదీ. రామానాయుడు నిర్మించిన ఈ సినిమాలో బుల్లి హీరో హరీష్ హీరో. ఈ సినిమా ఇక్కడ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. విచిత్రం ఏంటంటే ఈ సినిమా చూసిన వారు మాలాశ్రీని మగజెంట్ అని.. హరీష్‌ను ఆడలేడీ అని సంబోధించేవారు. అంటే మాలాశ్రీ గట్స్ అలా ఉండేవి. పవర్ ఫుల్, పొగరు బోతు క్యారెక్టర్లలో ఆమె ఇరగదీసేది. ఇక్కడ హిట్ అయిన ప్రేమఖైదీ సినిమాను హిందీలో కూడా హరీష్, కరీనా కపూర్ జంటగా రీమేక్ చేస్తే అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది.
అసలు మాలాశ్రీ ఏమైపోయిందో ఇటీవల ప్రేక్షకులకు కూడా గుర్తు లేదు. అయితే ఎట్టకేలకు ఆమె చాలా రోజుల తర్వాత ఆలీ ప్రోగ్రామ్‌లో కనిపించింది. ఆమె కన్నడంలో ఒకే యేడాది 19 సినిమాలు చేసింది. ఇది నిజంగా పెద్ద రికార్డ్. అప్పట్లో సూపర్‌స్టార్ కృష్ణ, ఎన్టీఆర్ లాంటి వాళ్లు మాత్రమే ఈ రేంజ్‌లో ఒకే యేడాది ఎక్కువ సినిమాలు చేసేవారు. ఎంత గొప్ప హీరోయిన్ అయినా కూడా ఒకే యేడాది ఇన్ని సినిమాల్లో నటించలేదు.
1990 – 1995 టైంలో మాలా శ్రీ తెలుగు ఇండస్ట్రీని కూడా ఏలేసింది. ఆమె హాట్ లుక్స్, గ్లామర్ డోస్ యూత్‌ను మైమరిపింజేసేది. మాలాశ్రీ మూలాలు కన్నడవే అయినా ఆమె పుట్టింది పెరిగింది అంతా చెన్నైలోనే..! ఎప్పుడూ నవ్వుతూ.. ఏ విషయంలో అయినా లైట్‌గా ఉండే మాలా శ్రీ వ్యక్తిగత జీవితంలో ఆనేక విషాదాలు ఉన్నాయ్. ఆమె వయసు ఇప్పుడు 48. నంజుండి కళ్యాణ అనే సూపర్ హిట్ సినిమాలో ఆమె నటించింది. అదే ఆమె కెరీర్‌కు పునాది. అయితే అదే యేడాది ఆమె తల్లి యాక్సిడెంట్‌లో చనిపోయింది.
ఆ తర్వాత తోటి కన్నడ నటుడు సునీల్‌తో రిలేషన్‌లో ఉండేది. ప్రేమలో ఉన్నారు.. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇంతలోనే మరో షాక్. సునీల్ యాక్సిడెంట్‌లో చనిపోయాడు. మాలాశ్రీకి కూడా తీవ్రగాయాలు అయ్యాయి. ఆ తర్వాత కోలుకుని నిర్మాత, కన్నడ డిస్ట్రిబ్యూటర్ రామును పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కూడా సినిమాలు చేసింది. గత యేడాది రాము కరోనాతో చనిపోయాడు. అప్పటి నుంచి ఆమె పేరే వినిపించడం లేదు.
ఇక మాలా శ్రీ – రాము దంపతులకు ఓ కుమార్తె. అన్నట్టు శుభ శ్రీ మీకు గుర్తుండే ఉంటుంది. ఆమె కూడా కొన్ని సినిమాలు చేసింది. ఆ శుభశ్రీ ఈ మాలాశ్రీకి స్వయానా చెల్లెలు. మాలాశ్రీ తాను హీరోయిన్ అయ్యాక చెల్లిని కూడా సినిమాల్లోకి తీసుకువచ్చి హీరోయిన్‌ను చేసింది. అర్జున్ జెంటిల్‌మెన్ సినిమాలో అల్లరి పిల్ల పాత్రలో కనిపించిన అమ్మాయి ఎవరో కాదు శుభశ్రీయే..!