ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చాలా కాంట్రవర్సీలతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వాళ్లకు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎంతో మంది సెలబ్రిటీల జీవితాలు.. వారి వ్యక్తిగత జీవితాలతో పాటు వారు విడాకులు తీసుకుంటారని కూడా వేణుస్వామి ముందే చెప్పి వార్తల్లో నిలుస్తున్నారు. వేణుస్వామి పాపులారిటీ మామూలుగా లేదు.
అంతెందుకు టాలీవుడ్ స్టార్ కపుల్ అక్కినేని నాగచైతన్య – సమంత కూడా ముందుగా విడిపోతారని సంచలన ప్రకటన చేసి వార్తల్లోకెక్కారు. చివరకు వేణు స్వామి చెప్పినట్టుగానే చైతు – సమంత విడిపోయారు. దీంతో వేణుస్వామి జాతకాలు నమ్మేవారు చాలా మందే ఉన్నారు. ఇక మరో క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ వైవాహిక జీవితంపై కూడా సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు.
ఇక వేణుస్వామి మాత్రమే కాదు.. ఆయన భార్య కూడా పాపులర్ సెలబ్రిటీయే. ఆమె భార్య వీణ వాయించడంలో పాపులర్. వీణ వాయించడంలో ఆమె నేర్పరి కావడంతో ఆమెను అంతరూ వీణా శ్రీవాణి అని పిలుస్తూ ఉండేవారు. యూ ట్యూబ్ వీడియోల ద్వారా కూడా ఆమె బాగా పాపులర్ అయ్యింది. వీణా శ్రీవాణి తెలుగులో పాపులర్ సంగీత దర్శకుల దగ్గర కూడా పలు సినిమాలకు, పాటలకు పని చేసింది.
ఇక వేణుస్వామి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమది ప్రేమ వివాహం అని చెప్పారు. బంధువుల ఇంట్లో తనకు శ్రీ వాణి పరిచయం అయ్యిందని.. ఆ తర్వాత తాము ప్రేమించుకుని ఇంట్లో వాళ్లను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నామని.. తమది సేమ్ కమ్యూనిటీయే అని.. తన భార్యకు తాను మహేష్‌బాబు కంటే ఎక్కువే అని చెప్పిన వేణు స్వామి.. తాను జీరోలో ఉన్నప్పుడు కూడా తన వెంటే ఉందని చెప్పాడు.
ఇక వేణు స్వామి భార్య కూడా ఓ ఇంటర్వ్యూలో తన భర్త గురించి గొప్పగా చెప్పారు. తన భర్త తిరుపతి లడ్డూలా ఉంటారని.. తాను ఆర్ ఆర్ బీలో స్టేట్ సెకండ్ ర్యాంకర్ అని చెప్పుకొచ్చింది. తాను అందానికి అస్సలు ప్రాధాన్యతే ఇవ్వనని.. వేణు స్వామి విషయంలో తానే కరెక్ట్ అని గొప్పగా చెప్పింది.